Dil Raju: ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు (Dil Raju) తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇక బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) గద్దర్ ఫిల్మ్ అవార్డులను (Gaddar Film Awards) ప్రకటించింది. ఇక ఈ అవార్డుల వేడుక శనివారం సాయంత్రం హైటెక్ సిటీలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)తో పాటు ఉప ముఖ్యమంత్రి, సినిమాటోగ్రఫీ మంత్రి హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతోమంది సినీ నటీనటులు పాల్గొని సందడి చేశారు.
విజయవంతంగా ముగిసిన గద్దర్ అవార్డుల వేడుక…
ఇక గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా ముగిసింది. ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా ఈ కార్యక్రమం విజయవంతంగా ముగియడంతో ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ దిల్ రాజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా ఈయన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమం గురించి ఎన్నో విషయాలను తెలియచేశారు..
కమిటీ సభ్యులలో విభేదాలు…
గద్దర్ అవార్డుల వేడుక హైటెక్ సిటీలో ఎంతో ఘనంగా జరిగింది. అయితే ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి గత ఆరు నెలలుగా ఎంతో కష్టపడుతున్నామని తెలిపారు. గద్దర్ అవార్డుల ఎంపిక కోసం ఒక కమిటీని నిర్ణయించామని, ఆ కమిటీ ప్రతి ఒక్క సినిమా గురించి చర్చించి ఎంపిక చేయాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. ఇలా సినిమాలను ఎంపిక చేసే సమయంలో కమిటీ సభ్యుల మధ్య కూడా విభేదాలు ఉంటాయని, వాటన్నింటిని పరిష్కరించుకొని ఈ అవార్డులను ప్రకటించామని తెలిపారు. ఇలా గత ఆరు నెలలుగా ఈ అవార్డుల కోసం కష్టపడటం వల్లే ఎంతో విజయవంతంగా పూర్తి అయిందని తెలిపారు.
తెలియక జరిగిన తప్పులు..
ఇక ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత నాపై ఉంది అందుకే అన్ని కార్యక్రమాలను దగ్గరుండి చూసుకున్నానని, అయితే నాకు తెలియకుండా ఎవరైనా ఈ కార్యక్రమంలో ఇబ్బందిపడి ఉన్నా వారందరికీ ఈ సందర్భంగా క్షమాపణలు తెలియజేస్తున్నాను అంటూ దిల్ రాజు క్షమాపణలు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో మీడియా మిత్రుల పాత్ర కూడా చాలా ఉందని, మీడియా వారికి కూడా ఈ సందర్భంగా ఈయన అభినందనలు తెలిపారు. అదేవిధంగా సినీ నటీనటులకు కూడా ఒక విన్నపాన్ని తెలియజేశారు. ప్రభుత్వం నుంచి ప్రోత్సహిస్తూ ప్రకటించే అవార్డులను నటీనటులు ఎక్కడున్నా కూడా వచ్చి ఆ అవార్డులను అందుకోవాలని తెలిపారు. షూటింగ్ పనులలో బిజీగా ఉండి రాలేకపోయామని చెప్పకుండా ప్రభుత్వం ఇచ్చే ఈ అవార్డులను ప్రతిష్టాత్మకంగా భావించి ఈ అవార్డులు అందుకోవడానికి రావాలని ఈయన తెలియజేశారు.