BigTV English

Jailer 2: హాలీవుడ్ రేంజ్‌లో ‘జైలర్ 2’.. మేకర్స్ మాస్ ప్లానింగ్ అదుర్స్.!

Jailer 2: హాలీవుడ్ రేంజ్‌లో ‘జైలర్ 2’.. మేకర్స్ మాస్ ప్లానింగ్ అదుర్స్.!

Jailer 2: ప్రస్తుతం ప్రపంచ మార్కెట్‌లో ఇండియన్ సినిమాల రేంజే పెరిగిపోయింది. హాలీవుడ్ సినిమాలకు సైతం పోటీ ఇచ్చేలా ఓవర్సీస్‌లో విడుదలయ్యి కలెక్షన్స్ సాధిస్తున్నాయి ఇండియన్ సినిమాలు. అందుకే పాన్ ఇండియా రేంజ్ నుండి పాన్ వరల్డ్ రేంజ్‌కు ఎదిగిపోయాయి. చాలావరకు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న మేకర్స్ కూడా వారి సినిమా రేంజ్‌లో మరింత పెంచుకుంటూ పోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం రజినీకాంత్ అప్‌కమింగ్ మూవీ ‘జైలర్ 2’ విషయంలో కూడా మేకర్స్ చేస్తున్న ప్లాన్ చూస్తుంటే మైండ్ పోతోంది అంటున్నారు ఫ్యాన్స్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ రూమర్ బయటికొచ్చింది.


ప్రోమో అదుర్స్

నెల్సన్ దిలీప్‌కుమార్ (Nelson Dilipkumar), రజినీకాంత్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘జైలర్’ సినిమా అప్పట్లో పలు రికార్డులను బ్రేక్ చేసింది. కలెక్షన్స్ విషయంలో అప్పటి సినిమాలు అన్నింటిని వెనక్కి నెట్టేసింది. దీనికి సీక్వెల్ పక్కా ఉంటుందనే విషయాన్ని మేకర్స్ అప్పుడే అనౌన్స్ చేయలేదు. కొన్నాళ్ల క్రితం ‘జైలర్ 2’ ఉండబోతుందని క్లారిటీ ఇచ్చారు. అప్పటినుండే ఈ మూవీని తెరపై ఎప్పుడెప్పుడు చూస్తామా అని రజినీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ‘జైలర్ 2’కు సంబంధించిన ప్రమోషనల్ షూట్ పూర్తయ్యిందని అప్డేట్ వచ్చిన కొన్నిరోజులకే ఆ ప్రోమో వీడియోను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. అది సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది.


ఆ భాషలో కూడా

‘జైలర్ 2’ (Jailer 2) ప్రోమో వీడియో, అందులో రజినీకాంత్ (Rajinikanth), అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.. అన్నీ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ‘జైలర్’ లాగానే దాని సీక్వెల్ కూడా సూపర్ హిట్ అవుతుందని ప్రోమో చూసే ఫిక్స్ అయిపోయారు. ప్రస్తుతం ఇంకా ఈ మూవీ షూటింగ్ మెల్లగా మొదలవుతోంది. ఇంతలోనే దీనికి సంబంధించిన ఒక క్రేజీ రూమర్.. కోలీవుడ్‌లో తెగ వైరల్ అవుతోంది. ‘జైలర్ 2’ సౌత్ భాషలు, హిందీతో పాటు ఇంగ్లీష్‌లో కూడా విడుదల అవుతుందని రూమర్స్ మొదలయ్యాయి. ఇంకా ఈ మూవీకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాలేదు, దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేకపోయినా.. ఇంగ్లీష్‌లో ఈ మూవీ విడుదల కానుందనే వార్త ఫ్యాన్స్‌ను ఎగ్జైట్ చేస్తోంది.

Also Read: ఆర్సీ 16 నుండి రెహమాన్ ఔట్.? క్లారిటీ ఇచ్చిన మేకర్స్..

సంగీతం వల్లే

‘జైలర్’ సినిమాను తెరకెక్కించిన సన్ పిక్చర్స్.. దాని సీక్వెల్‌ను కూడా భారీ రేంజ్‌లో నిర్మించడానికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా అనిరుధ్ అందించే సంగీతం వల్ల ఈ సీక్వెల్ కూడా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ‘జైలర్’ మూవీ యావరేజ్‌గా ఉన్నా అనిరుధ్ సంగీతం వల్లే అది సూపర్ హిట్ అయ్యిందంటూ స్టేట్‌మెంట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు రజినీకాంత్. ఆ స్టేట్‌మెంట్‌ను చాలామంది ప్రేక్షకులు ఒప్పుకున్నారు కూడా. ఇప్పటికే విడుదలయిన ‘జైలర్ 2’ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చూస్తుంటే మరోసారి అదే జరగనుందని ఆడియన్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రజినీకాంత్.. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కూలీ’తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ మూవీ ఏప్రిల్ లేదా మేలో విడుదల కానుంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×