BigTV English

AR Rahman: ఆర్సీ 16 నుండి రెహమాన్ ఔట్.? క్లారిటీ ఇచ్చిన మేకర్స్..

AR Rahman: ఆర్సీ 16 నుండి రెహమాన్ ఔట్.? క్లారిటీ ఇచ్చిన మేకర్స్..

AR Rahman: మామూలుగా సినీ సెలబ్రిటీలు తమ పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ విషయాలను విడివిడిగానే చూస్తారు. పర్సనల్ లైఫ్‌లో ఏం జరుగుతున్నా కూడా ప్రొఫెషనల్ లైఫ్‌పై దాని ఎఫెక్ట పడకుండా జాగ్రత్తపడతారు. తాజాగా ఆస్కార్ అవార్డ్ గ్రహిత ఏఆర్ రెహమాన్ తన భార్యకు విడాలకు ఇస్తున్నట్టుగా ప్రకటించారు. దాదాపు మూడు దశాబ్దాలు కలిసున్నారు కాబట్టి ఆ డివోర్స్ వల్ల రెహమాన్ మానసికంగా కృంగిపోయాడని, ప్రస్తుతం తన చేతిలో ఉన్న సినిమాలు కూడా వదిలేసుకొని కొన్నాళ్లు అందరికీ దూరంగా వెళ్లిపోనున్నాడని వార్తలు వినిపించాయి. ఆయన చేతిలో ఉన్న సినిమాల్లో ఆర్సీ 16 కూడా ఒక్కటి కాగా.. అసలు ఈ సినిమా నుండి నిజంగానే రెహమాన్ తప్పుకున్నాడా లేదా అనే విషయంపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.


అప్పుడే కన్ఫర్మ్

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్ (Ram Charan) ఇప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆ రెండు సినిమాలు ప్రేక్షకులను అంతగా ఇంప్రెస్ చేయలేకపోయాయి. అందుకే తన అప్‌కమింగ్ సినిమాలపైనే ప్రేక్షకులు భారీగా అంచనాలు పెంచుకున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్.. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో బిజీగా ఉన్నాడు. ‘ఆర్సీ 16’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్నే పెద్ద ఈవెంట్‌గా ఏర్పాటు చేశారు మేకర్స్. అప్పుడే ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.


అస్సలు నమ్మొద్దు

ఏఆర్ రెహమాన్ మామూలుగా ఏ సినిమాకు సంగీతం అందించడానికి అంత త్వరగా ఒప్పుకోరు. ఒకవేళ ఒప్పుకున్నా కూడా ఆయన మధ్యలోనే తప్పుకున్న ప్రాజెక్ట్స్ కూడా ఎన్నో ఉన్నాయి. ఆర్సీ 16 (RC 16) కూడా ఆ లిస్ట్‌లో యాడ్ అయ్యిందని గత కొన్నిరోజులుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇటీవల సైరా బానుతో విడాకులు అవ్వడం వల్ల రెహమాన్ మానసికంగా కృంగిపోయారని, అందుకే బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నారని రూమర్స్ వచ్చాయి. దీనిపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇది ఫేక్ న్యూస్ అని, ఈ రూమర్స్‌ను నమ్మొద్దు, షేర్ చేయొద్దు అని కోరారు. ఇక ఈ సినిమకు సంబంధించిన కొత్త షెడ్యూల్ కూడా జనవరి 27 నుండి ప్రారంభం కానుందని బయటపెట్టారు.

Also Read: ఆస్కార్ గ్రహీతకు ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..?

పాటలు పూర్తయ్యాయి

ఆర్సీ 16లో ఏఆర్ రెహమాన్ (AR Rahman) భాగం కాదు అనేవి కేవలం రూమర్స్ అని ప్రేక్షకులకు క్లారిటీ వచ్చేసింది. ఇక ఆర్సీ 16 ప్రారంభమయిన కొత్తలో కూడా ఏఆర్ రెహమాన్ ఈ మూవీపై స్వయంగా స్పందించారు. అప్పటికే ఈ మూవీకి సంబంధించిన మ్యూజిక్ వర్క్స్ ప్రారంభం అయ్యాయని అన్నారు. అంతే కాకుండా రెండు పాటలు కూడా పూర్తయ్యాయని తెలిపారు. దర్శకుడు బుచ్చిబాబు తన డెబ్యూ మూవీ ‘ఉప్పెన’ తర్వాత పూర్తిగా ఆర్సీ 16పైనే పనిచేయడం మొదలుపెట్టారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ మరోసారి చిట్టిబాబు లాంటి పాత్రల్లో కనిపించనున్నాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Related News

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

TFCC Elections : ముగిసిన వివాదం… త్వరలోనే ఛాంబర్‌కి ఎలక్షన్లు

Big Stories

×