BigTV English

Illu Illalu Pillalu Today Episode: నర్మదా, శ్రీవల్లి మధ్య ఫైట్.. సాగర్ కు కోపం తెప్పించిందని నర్మదా.. మరోసారి షాకిచ్చిన శ్రీవల్లి..

Illu Illalu Pillalu Today Episode: నర్మదా, శ్రీవల్లి మధ్య ఫైట్.. సాగర్ కు కోపం తెప్పించిందని నర్మదా.. మరోసారి షాకిచ్చిన శ్రీవల్లి..

Illu Illalu Pillalu Today Episode may 28th: నిన్నటి ఎపిసోడ్ లో.. సాగర్, నర్మదా రెండు రోజులు ఒంటరిగా భార్యతో ఎంజాయ్ చేసిన సాగర్ ఆ జ్ఞాపకాల నీ నెమరు వేసుకుంటూ ఇంటికి తిరిగి వస్తారు. ఇంట్లోకి రాగానే ప్రేమ వేదవతి అందరూ వాళ్ళని పలకరిస్తారు. కానీ రామరాజు ఫోన్ చేస్తాడు. అది చూడగానే సాగర్ టెన్షన్ పడతాడు.. ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశావు రా అని రామరాజు అడుగుతాడు. నీకోసం ఇంత చేస్తున్నావ్ తండ్రి చెప్పిన మాటని కనీసం లెక్క చేస్తున్నావా నువ్వు అని నానా మాటలు తిడతాడు… ఎంతో ముఖ్యమైన పని కాబట్టే నీకు అప్పగించాను మొండి బాకీలు కాబట్టే నువ్వు దగ్గరుండి తీసుకొస్తావని నేను అనుకున్నాను కానీ నువ్వేమో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నీ భార్యతో షికార్లు చేస్తున్నావా అని రామరాజు తిడతాడు. కొత్తగా పెళ్లయిన వాళ్లతో ఇలానే నా ఉండేది వాళ్ళ ఇష్టం కదా కాస్త సరదాలనే ఉంటాయి కదా..  దాన్ని మీరు అర్థం చేసుకోవాలి కదా అని.. ఆ విషయం నాకు చెప్పి వెళ్ళొచ్చు కదా నేను వాళ్ళిద్దరూ సరదాగా ఉంటే వద్దని చెప్తున్నాను అని రామరాజు అరుస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ధీరజ్ నాన్న మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ప్రేమ వచ్చి సెటైర్లు వేస్తుంది.. మరి లేకుంటే నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? మీ నాన్న అన్న దాంట్లో తప్పేముంది. తప్పులేదు ఇన్ని రోజులు నేను మా నాన్న తిడుతున్నారేమో అని అనుకున్నాను కానీ మా నాన్న మా కోసం ఇంత బాధ పడుతున్నారని తెలియనే తెలీదు. అయితే మా నాన్న ఏరోజైనా మా ఎదుగుదలను చూసి సంతోష పడతాడు అలా నేను చేసి చూపిస్తానని ధీరజ్ అంటాడు.. ధీరజ్ని చూసి ప్రేమ సంతోషపడుతుంది. నువ్వు మీ నాన్న అనుకున్న స్థాయికి ఎదుగుతావని నేను అనుకుంటున్నాను నేను నమ్ముతున్నానని ప్రేమ అంటుంది..

అటు నర్మదా బాధపడుతూ ఉంటే అక్కడికి వెళ్లి ఏంటి మీ నాన్నన్న మాటలకి బాధపడుతున్నావా.. తప్పేముంది ఎందుకు బాధపడుతున్నావ్ ఆయన అన్నదాంట్లో తప్పు లేదు కదా అనేసి అంటుంది. మీద రూపాయి పెడితే అదిరిపోయి కూడా విలువ చేయలేవని ఆయన అన్నాడు అది 100% నిజం. ఆ రైస్ మిల్లులో పనిచేస్తూ ఉంటే నీకు అసలు విలువే ఉండదు అది నువ్వు గుర్తించుకో సాగరని నర్మదా అంటుంది. కూడా మా నాన్న మాదిరే మాట్లాడుతున్నావు. ఆఖరికి నీకు కూడా నేను చీప్ అయిపోయాను అని సాగర్ అంటాడు. అవును అది నిజమే అయితే నువ్వు ఆ రైస్ మిల్లు పని చేయడం మానేసి.. వేరే జాబ్ వెతుకు లేదంటే మాత్రం నీకు అసలు విలువే ఉండదు అని నర్మదా అంటుంది. దానికి సాగరు ఆలోచిస్తాడు..


ఇక శ్రీవల్లి నర్మదా గొడవ గురించి తన తల్లికి చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. బయటకొచ్చి ఎవరూ లేని ప్లేస్ లోకి వెళ్లి భాగ్యంతో ఫోన్ మాట్లాడుతుంది. ఆ నర్మదా నన్ను ఎంత మాటలనేసింది అమ్మ నేను పెద్ద కోడలు అయితే నేను రాక మొన్న వచ్చిందని నేను తీసి పడేసింది. నాకు విలువే లేదు ఇంట్లో అని ఏడుస్తుంది అయితే నువ్వు వెంటనే బ్యాగ్ సర్దుకుని రా అని భాగ్యం అంటుంది. కానీ శ్రీవల్లి మాత్రం అదేంటమ్మా అలా అనేసావంటే నీకు ఏం చెప్పి పంపించాను నువ్వేం చేస్తున్నావ్? అర్ధరాత్రిలో ఫోన్ చేసి ఏడుస్తావా అని అంటుంది..

ఆ సాగరు నర్మదా మీ ఆయనకు చెప్పేలోగా ఈ విషయాన్ని నువ్వే మీ ఆయనకు చెప్పి ఇంట్లో మరో పిచ్చి పెట్టాలి అప్పుడే నీ మాటకు విలువ ఉంటుంది అని భాగ్యం చెప్తుంది. భాగ్యం చెప్పిన విధంగానే శ్రీవల్లి లోపలికి వెళ్లి చందుతో ఈ విషయాన్ని చెప్తుంది. మావయ్య గారు టెన్షన్ పడుతుంటేనే నేను ఆ ఫోటోలు గురించి చెప్పాను తప్ప వేరే ఉద్దేశంతో చెప్పలేదు. నర్మదా ప్రేమను నా సొంత చెల్లెలు లాగా చూసుకుంటున్నాను. నేను చేసిన తప్పేంటండి అని శ్రీవల్లి అడుగుతుంది. శ్రీవల్లి కన్నీళ్ళకు కరిగిపోయిన చందు నువ్వు చేసింది దాంట్లో నీ తప్పేమీ లేదు అని ఓదారుస్తాడు. ఇక తర్వాత ఉదయం రామరాజు బయటికి వెళ్లడానికి వేదవతిని క్యాష్ బ్యాక్ తాళాలు తీసుకుమని అడుగుతాడు.

ధీరజ్ కాలేజీకి వెళ్లడానికి బండి స్టార్ట్ చేస్తూ ఉంటాడు. వస్తువులను బయట వదిలేయడం వీడికి అలవాటే అని రామరాజు అన్న మాటలు తలుచుకొని బండి తాళాలను వేదవతి చేతికిస్తాడు.. అయితే వేదవతి నువ్వు కాలేజీకి ఎలా వెళ్తావు జాబ్ కి ఎలా తీసుకెళ్తావ్ బండి లేకుండా ఉంటేనే అడుగుతుంది.. పర్లేదు అమ్మ నేను చూసుకోగలను అని ధీరజ్ వెళ్ళిపోతాడు. వేదవతి కోపంగా వచ్చి రామరాజు అంటుంది. వాటిలో ఉన్న కోపాన్ని నువ్వు చూస్తున్నావు కానీ వాడు జీవితంలో పైకి ఎదుగుతాడని నాకు నమ్మకం ఉంది అని రామరాజు అంటారు.. ఇక ధీరజూ తన ఫ్రెండ్ బండి తీసుకుని డెలివరీలు ఇవ్వడానికి వెళ్తాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Big Stories

×