Sree Vishnu: టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు సింగిల్ మూవీ తో ఈ నెల 9న ప్రేక్షకులు ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్నారు. ఫుల్ కామెడీ ఎంటర్టైన్ గా ఈ మూవీ తొలిరోజే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని, థియేటర్లలో సందడి చేస్తుంది. మొత్తం రెండు రోజులలో 12 కోట్ల రికార్డు సాధించింది. తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ ను నిర్వహించింది మూవీ టీం. అందులో భాగంగా అల్లు అరవింద్, మూవీ లాభాలలో కొంత భాగాన్ని ఇండియన్ ఆర్మీకి ఇస్తున్నట్లు తెలపడం విశేషం. ఇక ఈ మూవీ హీరో శ్రీ విష్ణు తాజాగా ఓ ఇంటర్వ్యూలో,బాలీవుడ్ ఆఫర్ గురించి ప్రస్తావించారు. ఆ వివరాలు చూద్దాం..
బాలీవుడ్ లో ఆఫర్ ..ఆ మూవీ తరువాత ..
సింగిల్ రిలీజ్ అయ్యి విజయవంతం అయినా నేపథ్యంలో శ్రీ విష్ణు ఇంటర్వ్యూ తో బిజీగా ఉన్నారు.ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను ఇంటర్వ్యూలో అభిమానులతో పంచుకున్నారు.అయన మాట్లాడుతూ ..సింగిల్ మూవీ ముందు స్వాగ్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాము, ఆశించిన స్థాయి లో విజయం అందుకోలేదు.అయినా ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత తమిళం నుంచి చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. అలాగే మొదటిసారి స్వాగ్ చూసిన తర్వాత బాలీవుడ్ నుంచి ఆఫర్ కూడా వచ్చిందని శ్రీ విష్ణు తెలిపారు.
ఆ హీరోలు సపోర్ట్ …ఎప్పటికి మర్చిపోను ..
ఇక శ్రీ విష్ణు ఆయన సినిమాలని పెద్ద హీరోలు చూసి ఫోన్ చేసి అప్పిషెట్ చేసినప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది. బ్రోచేవారెవరురా లాంటి సినిమాకు చాలా ప్రశంసలు అందాయి.బ్రోచేవారెవరురా మూవీ చూసి విశ్వనాథ్ గారు అప్లిషేడ్ చేయడం చాలా ఆనందం అనిపించింది. ఆ సమయంలో గొప్ప ఫీలింగ్ కలిగిందని ఆయన తెలిపారు. చిరంజీవి, వెంకటేష్, రవితేజ, బన్నీ ఇలా పెద్ద హీరోలు అందరూ నా సినిమాకి సపోర్ట్ చేయడం చాలా ఆనందం అనిపిస్తుంది. నీది నాది ఒకే కథకు వెంకటేష్, చాలా బాగా చేశారు అని అన్నారు.అని ఆయన తెలిపారు.ఇక అల్లు అర్జున్ సమర్పణలో విద్యా కోపినీడి భాను ప్రతాప్, ప్రియాతి చౌదరి, సంయుక్తంగా సింగిల్ మూవీని నిర్మించారు. ఈ మూవీలో కేతిక శర్మ ఇవాళ హీరోయిన్లుగా నటించారు. కార్తీక్ రాజు దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. సింగిల్ మూవీ లో శ్రీవిష్ణు తో సమానంగా వెన్నెల కిషోర్ నటించారు. అరవింద్ క్యారెక్టర్ లో వెన్నర్ కిషోర్ నవ్వులు పూయించారు. ఇక ఈ మూవీ మే 9 న రిలీజ్ చేశారు. శ్రీ విష్ణు కెరియర్ లోనే విజయవంతమైన చిత్రంగా సింగిల్ నిలిచింది.
ట్రయంగిల్ లవ్ స్టోరీ ..
ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, ప్రభాస్ శీను, కీలకపాత్రలో నటించారు. ఈ చిత్రానికి సంగీతం విశాల్ అందించారు. ఈ చిత్రంలో విజయ్ పాత్రలో శ్రీ విష్ణు నటించారు. ఇక కథ విషయానికి వస్తే విజయ్ ఒక బ్యాంకులో పని చేస్తూ ఉంటాడు ఇన్సూరెన్స్ విభాగంలో అందరితో సరదాగా మాట్లాడి చేత ఇన్సూరెన్స్ కట్టిస్తూ ఉంటారు. అదే బ్యాంకులో పని చేసే అరవింద్ ను ఓ అమ్మాయి ప్రేమిస్తుంది. వారిద్దరిని ఎలాగైనా విడగొట్టాలని విజయ్ అనుకుంటాడు. ఈ టైం లోనే పూర్వాని చూసి విజయ్ ప్రేమిస్తాడు. ఒక కారు షోరూంలో హీరోయిన్ పని చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే హరిణి విజయ్ జీవితంలోకి ఎంట్రీ ఇస్తుంది. ఆమె విజయ వెనకాల పడుతుంది. పూర్వ విజయ్ చుట్టూ తిరుగుతుంది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎలాంటి మలుపులు తిరిగింది అనేది తెలియాలంటే ధియేటర్ కి వెళ్లి చూడాలి.
Naveen Chandra: టికెట్ డబ్బులు వాపస్… లెవన్ మూవీకి నవీన్ చంద్ర హామీ