BigTV English

SreeLeela: స్టార్ హీరోతో శ్రీ లీలా ప్రేమాయణం.. గుట్టు విప్పిన స్టార్ ప్రొడ్యూసర్..!

SreeLeela: స్టార్ హీరోతో శ్రీ లీలా ప్రేమాయణం.. గుట్టు విప్పిన స్టార్ ప్రొడ్యూసర్..!

SreeLeela:ప్రముఖ కన్నడ బ్యూటీ శ్రీ లీలా (Sree Leela)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ‘పెళ్లి సందD’ సినిమాతో తొలిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత రవితేజ(Raviteja ) హీరోగా నటించిన ‘ధమాకా’ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది. ఈ సినిమా తర్వాత మళ్లీ ఆమె వెను తిరిగి చూడలేదు. ముఖ్యంగా వరుసగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుని, బిజీగా మారిపోయింది. అయితే అవకాశం వచ్చిన ప్రతి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్లే కాస్త తడబాటు పడిందని చెప్పవచ్చు. కథల ఎంపిక విషయంలో సరైన నిర్ణయం లేకపోవడం వల్లే.. ఒకే ఏడాది తొమ్మిది సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రికార్డు సృష్టించినా.. డిజాస్టర్ లను చవిచూసింది ఈ ముద్దుగుమ్మ.


ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే రికార్డ్ సృష్టించిన శ్రీ లీల..

ఇక గత ఏడాది బాలకృష్ణ(Balakrishna )హీరోగా నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమాలో బాలకృష్ణకి కూతురు పాత్రలో నటించింది. ఈ సినిమా విజయం సాధించింది కానీ ఈ సినిమా క్రెడిట్ మొత్తం బాలకృష్ణ ఖాతాలోకి వెళ్లిపోయింది. ఇదిలా ఉండగా గత ఏడాది డిసెంబర్లో అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా నటించిన ‘పుష్ప 2’ సినిమా విడుదలయ్యింది. ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అతి తక్కువ సమయంలోనే రూ.1000 కోట్ల క్లబ్లో చేరి రికార్డు సృష్టించింది. అయితే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి ప్రేక్షకులను అబ్బురపరిచింది ఈ ముద్దుగుమ్మ. “కిస్ కిస్ కిస్సీక్” అంటూ సాగిన ఈ పాటకు యూట్యూబ్లో భారీ పాపులారిటీ లభించింది. అంతేకాదు ఈ పాట ద్వారా శ్రీలీలా కూడా క్రేజ్ దక్కించుకుందని చెప్పవచ్చు.


ప్రేమలో పడ్డ శ్రీ లీల..

ఇదంతా కాసేపు పక్కన పెడితే.. శ్రీ లీల తాజాగా ప్రేమలో పడిందనే ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి తోడు ఒక స్టార్ ప్రొడ్యూసర్ ఈ విషయంపై అధికారికంగా కామెంట్లు చేయడంతో హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. ఆయన ఎవరో కాదు బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ (Karthik Aryan). అయితే వీరిద్దరి ప్రేమ రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో. వీరిద్దరి కాంబినేషన్లో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ త్వరలోనే తెరకెక్కబోతోందని సమాచారం. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు తెచ్చుకున్న కరణ్ జోహార్(Karan Johar), ఈ సినిమాను చాలా వినూత్నమైన రీతిలో తెరకెక్కించబోతున్నట్లు హీరో కార్తీక్ ఆర్యన్ తాజాగా వెల్లడించారు.

క్లారిటీ ఇచ్చిన కార్తీక్ ఆర్యన్..

కార్తీక్ ఆర్యన్ మాట్లాడుతూ.. నేను ఇప్పటికే ప్రేమలో మూడుసార్లు విఫలమయ్యాను. అందుకే నాల్గవసారి మళ్లీ ప్రేమలో పడ్డాను. అయితే ఈసారి ఇంతకు ముందులాగా కాకూడదని కోరుకుంటున్నాను అంటూ “తు మేరీ మై తేరా మై తేరా తు మేరీ” అనే చిత్రాన్ని కూడా ప్రకటించాడు. ఇకపోతే ఈ చిత్రానికి సమీర్ విద్వాన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాదు శ్రీ లీలా కి ఇదే తొలి బాలీవుడ్ చిత్రం కూడా కావడం గమనార్హం. ఇకపోతే ఇప్పటికే చాలామంది సౌత్ హీరోయిన్స్ బాలీవుడ్ లోకి కోటి ఆశలతో అడుగుపెట్టి, ఒకటి రెండు సినిమాలకే పరిమితమయ్యారు. మరి ఇప్పుడు శ్రీ లీలా పరిస్థితి ఎలా ఉండబోతుందో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×