Srikanth Addala: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న దర్శకులలో శ్రీకాంత్ అడ్డాల కొంచెం ప్రత్యేకమని చెప్పాలి. కొత్త బంగారులోకం (Kottha Bangarulokam) సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ సాధించారు. యూత్ అందరూ విపరీతంగా ఆ సినిమాను ఎంకరేజ్ చేశారు. ఆ సినిమా తర్వాత వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (Seethamma Vaakitlo Sirimalle Chettu) సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమాతోనే తెలుగు చిత్ర పరిశ్రమలో మళ్లీ మల్టీ స్టారర్ సినిమాలు మొదలయ్యాయి. విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు లను అన్నదమ్ములుగా చూపించి చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్ కు నడిపించారు. ఈ సినిమా తర్వాత ముకుంద సినిమాతో వరుణ్ తేజ్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
ప్రతి సినిమా ప్రత్యేకం
శ్రీకాంత్ అడ్డాల ప్రతి సినిమాలోని ఒక డైలాగ్ తో సినిమా మొదలవుతుంది. అదే డైలాగ్ కు జస్టిఫికేషన్ సినిమా చివర్లో ఇస్తాడు. ఇక కొత్త బంగారులోకం సినిమాతో యూత్ కి మంచి మెసేజ్ ఇవ్వడం మాత్రమే కాకుండా అద్భుతమైన సాహిత్యం ఉన్న పాటలను కూడా అందించారు. ఆ సినిమాలోని నీ ప్రశ్నలు నీవి ఎవ్వరూ బదులు ఇవ్వరుగా అనే పాట ఇప్పటికీ చాలామందికి ఒక పాఠం లా అనిపిస్తుంది. శ్రీకాంత్ అడ్డాల చేసిన ప్రతి సినిమాలోను కొన్ని పాటల్లో సాహిత్య విలువలు ఉంటూనే ఉంటాయి. వరుసగా మూడు హిట్ సినిమాలు చేసిన తర్వాత ఊహించిన రీతిలో బాక్సాఫీస్ వద్ద బ్రహ్మోత్సవం సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఆ సినిమాతోనే శ్రీకాంత్ అడ్డాల కెరియర్ కి లాంగ్ గ్యాప్ వచ్చింది. మళ్లీ నారప్ప సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.
Also Read : Surya SonOf Krishnan : ఇది కేవలం సినిమా మాత్రమే కాదు – వెంకీ అట్లూరి
బ్రహ్మోత్సవం వరకు కారు లేదు
మామూలుగా ఒక సినిమా హిట్ పడగానే చాలామంది కార్లలో తిరుగుతూ ఉంటారు. అయితే బ్రహ్మోత్సవం సినిమా వరకు కూడా శ్రీకాంత్ అడ్డాల కారు కొనుక్కో లేదట. షూటింగ్ టైంలో బైక్ పైన షూటింగ్ కి వెళ్ళిపోయే వారట. అయితే ఒక సందర్భంలో వెంకటేష్ గారు మీకు కారు ఇస్తారు అన్నది డైరెక్టర్ అనే లెవెల్ చూసి కాదు. బైక్ పైన వస్తుంటావు కదా ఊహించని విధంగా ఏదైనా జరిగే అవకాశాలు ఉన్నాయి. కారులో కంఫర్ట్ గా వస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు. మన పని కూడా చాలా ఈజీ అవుతుంది అంటూ శ్రీకాంత్ అడ్డాల బిగ్ టీవీ కిసిక్ టాక్ షో లో చెప్పారు.