Lady Aghori: లేడీ అఘోరీ తో హిజ్రాలు భేటి అయ్యారు. అది కూడా ఎక్కడో కాదు ఏకంగా స్మశాన వాటికలో. ఇంతకు వీరి మధ్య ఏ చర్చ సాగిందో కానీ, వీరి భేటి మాత్రం ఇప్పుడు సంచలనంగా మారింది.
అఘోరీ మాత అంటే పెద్ద పరిచయం చేయాల్సిన పని కూడా లేదు. కారణం తెలుగు రాష్ట్రాలలో ఆమె అంత ఫేమస్. సాధారణంగా అఘోరా అంటేనే నిత్యం తపస్సు లో, వేరే ప్రపంచంలో ఉంటారన్నది మొదటి నుండి వస్తున్న వ్యవహారం. కానీ ఈ అఘోరీ మాత సమాజంలోకి రావడం, నగ్నంగా తిరగడం.. అది కాస్త అక్కడక్కడా వివాదం కావడం.. వార్తల్లో నిలవడం అందరికీ తెలిసిన విషయమే. అందుకే కాబోలు ఈ అఘోరీ మాత కాలు బయటకు పెట్టినా, మీడియా కూడా ఆమెపై ఫోకస్ చేస్తుందని చెప్పవచ్చు.
ఏపీలో పర్యటించిన అక్కడ హల్చల్ చేశారు. అది కూడా శ్రీకాళహస్తి ఆత్మార్పణ యత్నానికి పాల్పడిన సమయం నుండి అంతా వివాదమే అక్కడ. చివరకు మంగళగిరి లో రహదారిపై బైఠాయింపు అయితే అది వేరే లెవెల్ అని చెప్పవచ్చు. నగ్నంగా రహదారి పై బైఠాయిస్తే, పోలీసులు పదుల సంఖ్యలో వచ్చినా కట్టడి చేయలేని పరిస్థితి. సనాతన ధర్మ పరిరక్షణ తన ఆశయం అని చెబుతున్న అఘోరీ మాత, ఇలా ప్రతి రోజూ ఏదో ఒక వార్తల్లో నిలుస్తున్నారు.
ఏపీ నుండి తెలంగాణ కు వచ్చిన అఘోరీ మాత, వరంగల్ స్మశానంలో ప్రత్యక్షమయ్యారు. అక్కడ పూజలు నిర్వహించడం, అది కాస్త స్థానికులకు తెలియడంతో అందరూ అక్కడికి చేరుకున్నారు. స్మశానంలో పూజలు చేయడం అఘోరా లకు సర్వసాధారణమే. కానీ నిత్యం వార్తల్లో నిలుస్తున్న అఘోరీ మాత కనిపించడంతో, అక్కడికి ప్రజలు భారీగా చేరుకున్నారు.
అలాగే పలువురు హిజ్రాలు కూడా అక్కడికి చేరుకొని ఆమెతో చర్చలు జరిపారు. తెలంగాణకు చెందిన శ్రీనివాస్.. అఘోరీగా మారిన విషయం అందరికీ తెలిసిందే. అందుకే హిజ్రాలతో అఘోరీ మాత కూడా మర్యాద పూర్వకంగా మెలిగారు. పబ్లిక్ ప్రదేశాల్లో ఎందుకు తిరుగుతున్నట్లు, పర్యటనల పేరుతో ప్రజల్లోకి ఎందుకు రావాల్సి వస్తోంది? లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తున్నాయి కదా అంటూ హిజ్రాల సంఘం నాయకురాలు ప్రశ్నించారట.
కానీ అఘోరీ మాత్రం తాను ఇప్పుడు ఏమి మాట్లాడలేనంటూ ప్రశ్నలకు దాట వేసినట్లు తెలుస్తోంది. అసలు అఘోరీ మాత మానసిక స్థితి తెలుసుకొనే ప్రయత్నం చేసిన హిజ్రాలు మాత్రం.. తమకు ఎటువంటి సమాధానం ఇవ్వకపోగా, అక్కడే కొద్దిసేపు ఉండి యోగక్షేమాలు అడిగి వెనక్కు వెళ్లారు. ఇటీవల వివాదాలు రేగడం, పోలీసుల అభ్యంతరాల నడుమ తిరుగుతున్న అఘోరీ మాత, ఇక సైలెంట్ గా సనాతన ధర్మ పరిరక్షణ కోసం పాటుపడుతూ తమ స్వగ్రామంలో ఆలయాన్ని నిర్మించే పనుల్లో నిమగ్నమయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
అఘోరితో అర్ధరాత్రి హిజ్రాల భేటీ
స్మశాన వాటికలో సేద తీరుతున్న అఘోరిని కలిసిన వరంగల్ హిజ్రాలు
పబ్లిక్ ప్రదేశాల్లో ఎందుకు తిరుగుతున్నావని, పర్యటనల పేరుతో ప్రజల్లోకి రావడంతో లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తున్నాయని ప్రశ్నించిన హిజ్రాల సంఘం నాయకురాలు
అఘోరి మానసిక స్థితి తెలుసుకునేందుకు… https://t.co/zWFCx6ztje pic.twitter.com/deWyP7OtMJ
— BIG TV Breaking News (@bigtvtelugu) November 20, 2024