Srinath Maganti: మా నాని అన్నను తిట్టడానికి నువ్వెవడివిరా.. నీకేం తెలుసు ఆయన గురించి.. ఇలాంటి మాటలు ఫ్యాన్స్ దగ్గర నుంచి వింటూ ఉంటాం. కానీ, ఈ మాటలు అన్నది ఫ్యాన్స్ కాదు. ఒక నటుడు. సాధారణంగా ఇండస్ట్రీలో ఎంతపెద్ద సినిమాలు తీసినా.. ఎన్ని మంచి పనులు చేసినా సెలబ్రిటీలకు బయట మర్యాద ఉండదు. వాడు, వీడు , పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు. ఇక ట్రోలర్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖాలు కనిపించవు కదా.. మనల్ని ఎవరేం చేస్తారు అన్న దైర్యంతో నోటికి ఏది వస్తే అది వాగేస్తూ ఉంటారు. అయితే ఒక నటుడు మాత్రం.. తన ఫేవరేట్ హీరోను మర్యాద లేకుండా పిలిస్తే అస్సలు ఊరుకోను అని చెప్పుకొస్తున్నాడు. అతనే శ్రీనాథ్ మాగంటి.
బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్ అనే సినిమాలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు శ్రీనాథ్. ఈ సినిమా కాకుండా కొన్ని చిత్రాల్లో హీరోగా నటించినా.. అతనికి అంత విజయాలను అందించలేకపోయింది. ఇక హీరోగా కాకుండా సపోర్టింగ్ రోల్స్ లో శ్రీనాథ్ బాగా ఫేమస్ అయ్యాడు. హిట్, హిట్ 2 సినిమాల్లో హీరోకు హెల్ప్ చేసే ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించి మెప్పించాడు. ఇక అనిమల్ సినిమాతో అతని జాతకం మారిపోయింది. రష్మికకు అన్నగా, రణబీర్ కపూర్ ఫ్రెండ్ గా శ్రీనాథ్ కనిపించాడు. ఈ సినిమా అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టింది.
గతేడాది రిలీజ్ అయిన లక్కీ భాస్కర్ లో కూడా శ్రీనాథ్ పాత్రకు ప్రేక్షకులు మంచి మార్కులే అందించారు. ముఖ్యంగా అతను చెప్పే డైలాగ్స్ కు ఫిదా అయ్యారు. సిగరెట్, ఆల్కహాల్, డ్రగ్స్ ఇచ్చే కిక్ కన్నా.. డబ్బిచ్చే కిక్కే ఎక్కువ అనే డైలాగ్ అయితే నెక్స్ట్ లెవెల్. ఈ డైలాగ్ కు త్రివిక్రమ్ కూడా ఫ్యాన్ అయిన్నట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న శ్రీనాథ్ తాజగా ఒక ఇంటర్వ్యూలో నాని గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. నాని అంటే తనకు ఎంతో ఇష్టమని, అతని గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా ఊరుకొనేది లేదు అని చెప్పుకొచ్చాడు.
RGV: అవన్నీ అబద్దాలే.. నమ్మకండి
శ్రీనాథ్ నటించిన హిట్ సినిమా సిరీస్ లకు నిర్మాత నానినే. ఆ సమయంలోనే వీరి మధ్య బాండింగ్ ఏర్పడినట్లు తెలుస్తోంది. ” ఒకడు నాని.. నాని అని అంటుంటే.. ఏందిరా నాని.. ఆయన గురించి నీకేం తెలుసు.. ఆయన ఏం చేసాడో నీకేం తెలుసు. మర్యాద ఇవ్వు అని అంటే అతను నీకు గొప్పేమో.. మాకేంటి అని అడిగాడు. హా.. మా నాని అన్నా.. మీ మా కూడా కాదు నా నాని అన్నా అని గట్టిగా మాట్లాడతాను.
నా నాని అన్నరా.. నడవదు. నా ఇంట్లో అన్న.. మా పెద్దన్న లెక్క. మా పెద్దన్నను తిడితే ఊరుకొనేది లేదు. నువ్వు ఫ్యాన్ అవ్వు.. అవ్వకపో అది మాకనవసరం. ఆయన ఎలాంటి మనిషో నీకు తెలియదు.. నాకు తెలుసు. నా నాని అన్నను తిట్టడానికి నువ్వెవడివి అని అంటాను. ఆయన గురించి తప్పుగా మాట్లాడడానికి ఏమి ఉండదు. నేను కొంచెం పోసిసివ్ గా ఉంటాను. అలా అని ఓ అన్నా .. అన్నా అని కూడా తిరగను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.