RGV: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సిండికేట్ అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెల్సిందే. సత్య సినిమా చూసాక తనకు బుద్ధి వచ్చిందని, ఇక నుంచి తాను దర్శకుడిగా చెప్పుకొనే సినిమాలు తీస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అందుకు తగ్గట్టుగానే సిండికేట్ అనే చేస్తున్నట్లు తెలిపాడు. ఒక్క మనిషి మాత్రమే అత్యంత భయంకరమైన జంతువు కాగలడు అనే లైన్ తో ఈ కథ నడుస్తుందని, సిండికేట్ అనేది సుదూర భవిష్యత్తులో సెట్ చేయని భవిష్యత్ కథ అని చెప్పుకొచ్చాడు.
సిండికేట్ ఎలాంటి సూపర్ పవర్స్ లేని చాలా ప్రమాదకరమైన సినిమా. కానీ, ఒక మనిషి భయంకరంగా ఏమి చేయగలడు అని చూపిస్తుందని, ఈ చిత్రం క్రైమ్ మరియు టెర్రర్ యొక్క స్వభావాన్ని లోతుగా చూపిస్తుందని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ సినిమాపై అభిమానులు అప్పుడే అంచనాలను పెట్టేసుకుంటున్నారు. ఒక సత్య, ఒక సర్కార్ లా ఈ సినిమాను తెరకెక్కించే పనిలో పడ్డాడు వర్మ. ఎప్పుడైతే ఈ చిత్రాన్ని అనౌన్స్ చేశాడో అప్పటి నుంచి ఇందులో నటించే స్టార్స్ గురించి రూమర్స్ మొదలయ్యాయి.
సిండికేట్ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, విక్టరీ వెంకటేష్, విజయ్ సేతుపతి తదితరులు నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా సిండికేట్ సినిమాను సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో దగ్గుబాటి సురేష్ బాబు నిర్మిస్తున్నట్లు కూడా టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఈ స్టార్ హీరోలతో వర్మ సంప్రదింపులు జరిపాడని, వారు కూడా కథ నచ్చి ఓకే చెప్పారని కూడా చెప్పుకొస్తున్నారు . ఇక ఈ వార్తలపై ఎట్టకేలకు వర్మ స్పందించాడు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలలో ఎలాంటి నిజం లేదని చెప్పుకొచ్చాడు. సిండికేట్ లో ఎలాంటి స్టార్ హీరోస్ ను తాను అనుకోలేదని చెప్పుకొచ్చాడు.
Jabardast Varsha : పింక్ లెహంగాలో వర్ష అందాలు చూడతరమా.. ఏముందబ్బా అసలు..
“సిండికేట్ చిత్రం యొక్క నటీనటుల ఎంపికపై రకరకాల ఊహాగానాలు జరుగుతున్నాయి, అవి పూర్తిగా అబద్ధం .. అన్ని సిద్ధమైనప్పుడు వివరాలను పంచుకుంటాను” అని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పడిందని చెప్పాలి. ఇక వర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇలా వివాదాల్లో విమర్శలకు గురి అవుతున్న వర్మ.. అప్పట్లో సెన్సేషనల్ సినిమాలతో హిట్లు అందించిన వర్మ ఒకరు కాదు.
ముఖ్యంగా ఇప్పటి జనరేషన్ కు ఆర్జీవీ ఒక జోకర్ లా కనిపిస్తున్నాడు. ఆయన ఏ సినిమా గురించి మాట్లాడినా ట్రోల్ చేస్తున్నారు. కానీ, ఇదే డైరెక్టర్ ఒకప్పుడు స్టార్ హీరోలతో చేసిన సినిమాలు ఇప్పటికీ ఇండస్ట్రీలో రికార్డులు సృష్టించాడు అనేది చాలామందికి తెలియదు. ఎలాగైనా ఈసారి వర్మ తనలో ఉన్న వింటేజ్ డైరెక్టర్ ను నిద్రలేపాలని చూస్తున్నాడు. సిండికేట్ సినిమాతో తన సత్తా చూపించాలని ఆరాటపడుతున్నాడు. మరి వర్మ అనుకున్నది సాధిస్తాడా లేదా అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే.
There are all kinds of speculations going around the casting of SYNDICATE film which are all completely FALSE ..Will share the details when ready
— Ram Gopal Varma (@RGVzoomin) January 25, 2025