Govinda: ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది తమను వాడుకున్నారు అంటూ కంప్లైంట్స్ ఇస్తున్నారు. వారి ఫిర్యాదులతో ఇండస్ట్రీలో జరరుగుతున్న బాగోతాలు బయటకు వస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ లో ఓ ఘటన వెలుగు చూసింది. దాంతో ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.. తాజాగా బాలీవుడ్ లో సీనియర్ నటుడు గోవిందా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పై కుట్ర చేస్తున్నారంటు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆచేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవిందా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన ఎన్నో విషయాల గురించి బయటపెట్టాడు. బాలీవుడ్‌లో తనపై కుట్ర చేశారని షాకింగ్ కామెంట్స్ చేశారు.. నన్ను ఇండస్ట్రీ నుంచి బయటికి పంపేందుకు కొందరు ప్రయత్నించారని వెల్లడించారు. తాను పెద్దగా చదువుకోలేదని.. వారంతా చదువుకున్న వారు కావడంతోనే నాతో ఆడుకున్నారని తెలిపారు. కేవలం నా నటన వల్లే ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నానని ఆసక్తికర విషయాలను షేర్ చేశారు. గతంలో ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ఆయన ఈ మధ్య ఇండస్ట్రీకి దూరం అయ్యాడు.. ఈ మధ్య ఏ ఒక్క సినిమాలో కూడా ఆయన నటించలేదు.. ఇప్పుడు ఇలా సంచలన వ్యాఖ్యలు చెయ్యడం పై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..
Also Read:ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..
గతంలో 2019 విడుదలైన రంగీలా రాజాలో కనిపించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. నటుడు తన కెరీర్‌లో 100 కోట్ల ప్రాజెక్ట్‌లను చేయలేకపోయినట్లు వెల్లడించారు. అంతేకాదు 100 కోట్ల ఆఫర్స్ ను వదిలేసుకున్నట్లు చెప్పాడు. ఆ మధ్య ఆయన విడాకుల పై కూడా రూమర్స్ వినిపించాయి. తన భార్య సునీతా అహుజాతో విడిపోతున్నారని వార్తలు తెగ వైరలవుతున్నాయి. వీటిపై ఇటీవలే ఆయన భార్య కూడా స్పందించింది. గోవిందను… తనను ఎవరూ విడదీయలేరని సునీతా అహుజా తేల్చిచెప్పారు.. తాను రాజకీయాల్లో ఉండటం వల్లే ఇద్దరం దూరగా ఉంటున్నాం తప్ప విడిపోలేదని క్లారిటీ ఇచ్చారు. వీరిద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత ఎప్పుడు దూరంగా ఉండలేదని చెప్పాడు. అలాగే వీరిద్దరికీ ఒక కుమార్తే, కుమారుడు ఉన్నారు. గోవిందా గొప్ప నటుడు.. ఎన్నో సినిమాల్లో నటించాడు. ఆయన పవర్ ఫుల్ రోల్ లో నటించాడు. ఇప్పటివరకు ఆయన నటించిన ప్రతి మూవీలో ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక ముందు సినిమాలు చేస్తాడా? లేదా అన్నది తెలియాల్సి ఉంది. మంచి పాత్రలు వస్తే చేస్తానని ఓ సందర్బంలో చెప్పాడు.
ఇటీవల ఇలాంటివి కామన్ అవుతున్నాయి. ఇంటర్వ్యూ లలో కొందరు నటులు తమకు అన్యాయం చేస్తున్నారంటు చెబుతున్నారు. కేవలం బాలీవుడ్ లో మాత్రమే కాదు. అటు టాలీవుడ్ తో పాటుగా తమిళ ఇండస్ట్రీలో కూడా ఇలాంటివి వినిపిస్తూనే ఉన్నాయి. ఇండస్ట్రీలోకి నిజంగా ఇలాంటివి జరుగుతున్నాయా అని గుసగుసలు వినిపిస్తున్నాయి.