Video: క్రికెట్ లో అనేక రకాల సంఘటనలు జరుగుతూ ఉంటాయి. క్రికెట్ అంటేనే ఫన్నీ గేమ్. ఇందులో ఏదైనా జరగవచ్చు. మ్యాచ్ గెలవడం అలాగే ఓడిపోవడమే కాకుండా… మ్యాచ్ మధ్యలో కొన్ని విచిత్ర సంఘటనలు కూడా జరుగుతాయి. బౌలర్ ఏదైనా మ్యాజిక్ చేయడం… లేదా బ్యాటర్ సిక్స్ లు కొట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి. లేదా మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో… క్రికెట్ అభిమానులు గ్రౌండ్ లోకి వచ్చి రచ్చ చేయడం చూస్తూ ఉంటాం. అయితే తాజాగా… ఓ స్టేట్ లెవెల్ క్రికెట్ లో…. అయిన రన్ అవుట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: Rishabh Pant : రిషభ్ పంత్ పై దారుణంగా ట్రోలింగ్.. నువ్వు ఎందుకు ఆడుతున్నావు అంటూ
రన్ అవుట్ చేయకుండా కుప్పిగంతులు
రనౌట్ ( Run Out )అవకాశం వస్తే కచ్చితంగా…. క్షణాల్లో అవుట్ చేస్తారు. కానీ తాజాగా ఓ జట్టుకు సంబంధించిన కుర్రాళ్ళు.. రన్ అవుట్ అవకాశం వస్తే, అవుట్ చేయకుండా కుప్పిగంతులు వేశారు. బంగ్రా (Bangra ) డాన్స్ వేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బిలాస్పూర్ వర్సెస్ మరో లోకల్ టీం మధ్య ఫైట్ జరిగింది. ఈ సందర్భంగా… వైభవ్ శర్మ ( Vaibhav Sharma) ఆఫ్ సైడ్ వైపునకు షార్ట్ కొట్టాడు. ఆ షాట్ కు సింగిల్ పరుగు మాత్రమే వస్తుంది. కానీ వైభవ్ శర్మ జోడి రెండు పరుగులకు ప్రయత్నించారు. అయితే.. బిలాస్పూర్ ప్లేయర్లు చాలా చాకచక్యంగా ఫీల్డింగ్ చేసి… వెంటనే వికెట్ కీపర్ వైపు బంతి వేశారు. ఆ సమయంలో వైభవ్ శర్మ జోడి.. బౌలర్ వైపు ఉన్నారు.. దీంతో అక్కడ రన్ అవుట్ చేసే అవకాశం వచ్చింది. అయితే వెంటనే రన్ అవుట్ చేయకుండా… వికెట్ కీపర్.., ఇతర ప్లేయర్లు బాంగ్ర డ్యాన్స్ వేయడం జరిగింది.
ఆ స్టెప్పులు వేసిన తర్వాత రన్ అవుట్ చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన క్రికెట్ అభిమానులు.. తమ స్టైల్ లో స్పందిస్తున్నారు. ఇదెక్కడి రన్ అవుట్ రా బాబు… రనౌట్ చేయకుండా తీన్మార్ స్టెప్పులు వేశారు అని కొంతమంది సెటైర్లు పేల్చుతున్నారు. ఇది ఫన్నీ క్రికెట్ అంటూ మరికొంతమంది అంటున్నారు. వికెట్.. తీసే ఉత్సాహంతో ఆ కుర్రాళ్ళు డాన్సులు వేశారని… మరి కొంతమంది అంటున్నారు. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలామంది క్రికెట్ ( Cricket) అభిమానులు దీన్ని చూసి నవ్వుకుంటున్నారు. ఇక ఈ వీడియోకు కూడా కోట్లల్లో వ్యూస్ వస్తున్నాయి. ఈ మ్యాచ్ ఏ జట్ల మధ్య జరిగిందనేది క్లారిటీగా వీడియోలు కనిపించడం లేదు కానీ… ఇండియాలోని ( India) దేశవాళి క్రికెట్ అని చెబుతున్నారు.
Also Read: Sarfaraz Khan – Ananya Bangar : గే తో సర్ఫరాజ్ ఖాన్ రిలేషన్… వీడియో వైరల్
Run-Out Celebration by the Bowling Team.
📹 3rdEyeTV pic.twitter.com/aADe0ZzdKG
— CricketGully (@thecricketgully) April 27, 2025