Elon Musk Tesla Robot Dance: ఎలన్ మస్క్. పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. టెస్లా నుంచి స్పేస్ ఎక్స్ వరకు ఆయన ఏ రంగంలో అడుగు పెట్టినా కనీవినీ ఎరుగని సక్సెస్ సాధించాడు. నాసా లాంటి అంతరిక్ష సంస్థకు సాధ్యంకాని పనులను ఆయన కంపెనీ ఈజీగా చేసేస్తోంది. తాజాగా మస్క్ అదిరిపోయే టెస్లా రోబోను పరిచయం చేశాడు. టెస్లా రోబో డ్యాన్స్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియా వేదికగా ఆయన షేర్ చేశాడు. చక్కగా డ్యాన్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్య పరిచింది ఈ రోబో.
చిట్టి మాదిరిగా ఆకట్టుకున్న టెస్లా రోబో
రజనీకాంత్ హీరోగా నటించిన ‘రోబో’ సినిమాలో చిట్టి అద్భుతంగా ఆకట్టుకుంటుంది. మనిషి చేసే పనులతో పాటు మనిషి చేయలేని పనులను కూడా చిట్టి అవలీలగా చేసేస్తుంది. డ్యాన్స్, ఫైటింగ్, కుక్కింగ్, పెయింటింగ్, సింగింగ్, ఒకటేమిటీ ప్రపంచంలోని అన్ని పనులను సింఫుల్ గా చేసేస్తుంది. తాజాగా ఎలన్ మస్క్ షేర్ చేసిన ఈ రోబో వీడియో కూడా అచ్చం చిట్టి లాగా పని చేస్తున్నట్లు అర్థం అవుతోంది. ఈ వీడియోను రియల్ టైమ్ లో క్యాప్చర్ చేయబడినట్లు వెల్లడించింది. రోబో అచ్చం మనిషిని పోలినట్లుగానే డ్యాన్స్ చేయడాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు.
మస్క్ తయారు చేసిన రోబో చేయబోయే పని అదేనా?
వాస్తవానికి ఎలన్ మస్క్ గతంలో ఓ కీలక విషయాన్ని ప్రకటించాడు. వచ్చే 5 సంవత్సరాలలో రోబోలు బెస్ట్ హ్యూమన్ సర్జన్లుగా మారబోతున్నట్లు వెల్లడిచింది. న్యూరాలింక్ ను తీసుకుంటే, మానవులకు బదులుగా సదరు యంత్రాలు ఎంతో సంక్షిష్టమైన సర్జరీలను కూడా సునాయాసంగా నిర్వహిస్తాయని వెల్లడించాడు. ఇప్పుడు ఆయన సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసిన రోబో కూడా డ్యాన్స్ చేయడంతో పాటు ఎత్తైన ప్రదేశాలను ఎక్కడం, దిగడం చేస్తోంది. ఇంకా చెప్పాలంటే అచ్చం చిట్టి రోబోగా తయారు చేస్తున్నట్లు అర్థం అవుతోంది.
— gorklon rust (@elonmusk) May 13, 2025
Read Also: మిడిల్ బెర్త్ విరిగి ప్రయాణీకురాలికి తీవ్ర గాయాలు, కనీసం ఫస్ట్ ఎయిడ్ చేయని రైల్వే అధికారులు!
టెస్లా రోబో చూసిన ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
ఎలన్ మస్క్ డెవలప్ చేసిన టెస్లా రోబోట్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మాస్క్ మామా రోబో డ్యాన్స్ అద్భుతంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చాలా మంది మనుషులతో పోల్చితే ఈ రోబో చాలా చక్కగా డ్యాన్స్ చేస్తుందని అభినందిస్తున్నారు. ఎత్తైన ప్రదేశాలను చక్కగా ఎక్కి, దిగుతున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ రోబో కచ్చితంగా ప్రపంచంలోనే అత్యుత్తమ రోబోగా రూపొందబోతోంది అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం అవసరం లేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా మస్క్ మామ ఏది చేసినా అద్భుతంగా ఉంటుందనే దానికి ఈ రోబో ఓ ఉదాహారణగా చెప్పుకోవచ్చు.
Daily walks help clear your mind pic.twitter.com/dUsW58trS6
— Tesla Optimus (@Tesla_Optimus) December 9, 2024
Read Also: విమానంలో షర్టులు విప్పి కూర్చున్న ప్రయాణీకులు.. ఏం చేస్తారు పాపం, పరిస్థితి అలాంటిది!