BigTV English

SS Rajamouli: భార్యతో కలిసి రాజమౌళి డ్యాన్స్.. వీడియో వైరల్

SS Rajamouli: భార్యతో కలిసి రాజమౌళి డ్యాన్స్.. వీడియో వైరల్


SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమాను పాన్ ఇండియా లెవెల్ కు తీసుకెళ్లిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఇప్పటివరకు అపజయం ఎరుగని దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న జక్కన్న ఆర్ఆర్ఆర్ లాంటి హిట్ సినిమా తరువాత SSMB29 తో బిజీగా మారాడు. మహేష్ బాబు హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ను పూర్తిచేసుకుంటుంది. ఇక రాజమౌళి కుటుంబంలో ఉన్నవారందరూ కూడా కలిసే ఉంటారు అన్న విషయం తెల్సిందే. ఎక్కడకు వెళ్లినా కూడా అంతా కలిసే వెళ్తారు. అన్నదమ్ములు అంతా కలిసే ఉంటారు.

తాజాగా వీరి ఇంట ఒక చిన్న ఫంక్షన్ జరిగింది. ఈ వేడుకలో రాజమౌళి.. తన భార్య రమా రాజమౌళతో కలిసి డ్యాన్స్ వేశాడు. సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ప్రేమికుడు సినిమాలోని అందమైన ప్రేమరాణి చేయి తగిలితే సాంగ్ కు జక్కన్న డ్యాన్స్ వేశాడు. ఇక అలవోకగా స్టెప్స్ వేస్తూ.. భార్యతో కలిసి రొమాన్స్ చేశాడు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్.. రాజమౌళి.. నువ్వే హీరోగా ట్రై చెయ్ అంటూ కొందరు.. అద్భుతమైన జంట అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు.


ఇక రాజమౌళి, రమాది ప్రేమ వివాహం. రాజమౌళి శాంతి నివాసం సీరియల్ కు అసిస్టెంట్ గా చేశాడు. ఆ సమయంలోనే రమా పరిచయం అయ్యింది. అప్పటికే రమాకు పెళ్లి అయ్యి.. ఒక బాబు కూడా ఉన్నాడు. అతడే కార్తికేయ. ఇక వీరి పరిచయం ప్రేమగా మారి.. పెళ్లికి దారి తీసింది. ఇక వీరిద్దరికి ఒక కూతురు కూడా ఉంది. రాజమౌళి ప్రతి సినిమాకు రమానే కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తుంది. మరి ఈ జంట.. ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ వచ్చేలా చేశారు అంటే SSMB29 తో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×