BigTV English
Advertisement

Ss Rajamouli: జక్కన్ననే వెయిట్ చేయిస్తున్న సినిమాలు ఇవే… ఈ లిస్ట్ మీరు కూడా చూడండి

Ss Rajamouli: జక్కన్ననే వెయిట్ చేయిస్తున్న సినిమాలు ఇవే… ఈ లిస్ట్ మీరు కూడా చూడండి

Ss Rajamouli: ఎస్.ఎస్ రాజమౌళి.. తెలుగు సినిమాని శిఖరం మీద కూర్చోబెట్టిన దిగ్గజ దర్శకుడు. సినిమా ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాదు. ఒక గొప్ప సినిమాని ఎల్లలు దాటించొచ్చు అని రుజువు చేశారు. తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేశారు. ఇప్పుడు అంతా కూడా పాన్ ఇండియా అని మాట్లాడుతున్నారు అంటే దానికి రీజన్ ఎస్ఎస్ రాజమౌళి. ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా ఎస్.ఎస్ రాజమౌళి సినిమాల గురించి ఆడియన్స్ ఎదురు చూస్తారు అనే విషయం అందరికీ తెలిసిందే కానీ రాజమౌళి కూడా కొన్ని సినిమాలు గురించి ఎదురుచూస్తున్నారు అంటే ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రతి దర్శకుడు ఇంకో దర్శకుడు చేసే సినిమాలను చూడాలనుకోవడం మామూలు విషయమే, కానీ ఆ సినిమా ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేయడం మాత్రం ఆశ్చర్య పడాల్సిన అంశం.


రాజమౌళి లిస్ట్

ఎస్ ఎస్ రాజమౌళి మొదట సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రాబోతున్న స్పిరిట్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారట. సందీప్ రెడ్డి వంగ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక సంచలనం సృష్టించాడు. ఆ సినిమా తర్వాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడ మరోసారి తెలుగు వాడి సత్తా ఏంటో చూపించాడు. సందీప్ రెడ్డి వంగా కి ఎస్.ఎస్ రాజమౌళికి మధ్య మంచి పరిచయం ఉంది. ఇద్దరు కూడా సినిమాలు గురించి విపరీతంగా మాట్లాడుకుంటారు. రాజమౌళి తీసిన ట్రిపుల్ ఆర్ సినిమా రిలీజ్ కి ముందు సందీప్ రెడ్డివంగా ఎస్.ఎస్ రాజమౌళిని ఇంటర్వ్యూ చేశారు. అలానే సందీప్ రెడ్డి వంగ అనిమల్ సినిమా ఈవెంట్ కు ఎస్ రాజమౌళి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇప్పుడు సందీప్ ప్రభాస్ ని ఎలా చూపిస్తాడు అని చాలా క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు రాజమౌళి.


నెక్స్ట్ డ్రాగన్

ప్రశాంత్ నీల్ కే జి ఎఫ్ సినిమాతో సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా చేసిన సలార్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ప్రస్తుతం ప్రశాంత్ చేస్తున్న సినిమా డ్రాగన్. ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం కూడా ఎస్.ఎస్ రాజమౌళి ఎదురుచూస్తున్నారట. అలానే ఉప్పెన సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు బుచ్చిబాబు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. బుచ్చిబాబు ప్రస్తుతం రామ్ చరణ్ తో పెద్ది అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం కూడా ఎస్.ఎస్ రాజమౌళి ఎదురు చూస్తున్నారట. పైన ప్రస్తావించిన ముగ్గురు హీరోలతోనూ రాజమౌళి పనిచేయడమే కాకుండా వాళ్లకు మంచి స్టార్డం తీసుకొచ్చి పెట్టాడు. ఇక ఆ రాజమౌళి హీరోలను మిగతా దర్శకులు ఎలా ప్రజెంట్ చేస్తారో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

Also Read : Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా అబద్ధం, మళ్లీ ఆ దర్శకుడికే అవకాశం

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×