Nalgonda Crime News: వాళ్లిద్దరు మధ్య పరిచయం ఏర్పడింది. పెళ్లి అంటూ యువతితో సహజీవనం చేశాడు. ఈ లోగా ఆ యువకుడు మరో యువతిని మ్యారేజ్ చేసుకున్నాడు. తాను మోసపోయానని ఆలస్యంగా తెలుసుకున్న యువతి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ఈ అవమానాన్ని భరించలేక యువతి చనిపోయిందా? చంపేశాడా? సంచలనం రేపిన ఈ ఘటన నల్గొండ జిల్లాలో వెలుగు చూసింది.
నల్గొండ జిల్లా బొకంతలపాడులో విషాద ఘటన జరిగింది. ఆ గ్రామానికి చెందిన మల్లేశ్వరి హైదరాబాద్ నిమ్స్‌లో స్టాఫ్‌నర్స్‌గా పని చేస్తోంది. సొంత గ్రామానికి చెందిన జాన్‌రెడ్డి రీహాబిలిటేషన్ సెంటర్‌లో పని చేస్తున్నాడు. ఇద్దరు ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో పరిచయం పెరిగింది.
అది కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు మనసులు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. నిజమేనని ఆ యువతి నమ్మేసింది. ఆ తర్వాత జాన్‌రెడ్డితో సహజీవనం మొదలైంది. తనను మోసం చేస్తున్నాడన్న విషయాన్ని ఆలస్యంగా గుర్తించింది. రెండు వారాల కిందట జాన్‌రెడ్డి మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.
కోరుకున్న ప్రియుడు ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేకపోయింది. తట్టుకోలేకపోయింది.. ఇంట్లోవాళ్లు హెచ్చరించినా ఫలితం లేకపోయింది. చివరకు మనస్థాపం చెందిన మల్లేశ్వరి హాస్టల్‌లో మత్తు ఇంజక్షన్ తీసుకుంది. ఆ తర్వాత మృతి చెందింది. యువతి డెడ్‌బాడీ తీసుకున్న ఆమె కుటుంబసభ్యులు జాన్ రెడ్డి ఇంటి ముందు ధర్నాకు దిగారు. జాన్‌రెడ్డిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
ALSO READ: పిన్ని చెల్లితో లవ్ ఎఫైర్.. తప్పని చెప్పినందుకు హత్య
తమకు న్యాయం చేయాలని జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు మల్లేశ్వరి బంధువులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. మరి పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి. తమకు న్యాయం జరగాల్సిందేనని మల్లేశ్వరి కుటుంబసభ్యులు అంటున్నారు.
యువకుడితో సహజీవనం.. యువతి అనుమానాస్పద మృతి..
నల్గొండ జిల్లా నిడమానూరు మండలం బక్కమంతులపాడు గ్రామంలో ఉద్రిక్తత
హైదరాబాద్ లో జాన్ రెడ్డి అనే యువకుడితో మల్లేశ్వరి సహజీవనం
మల్లేశ్వరిని కాదని మరో యువతిని పెళ్లి చేసుకున్న జాన్ రెడ్డి
ఇదే సమయంలో మల్లేశ్వరి మృతి
మల్లేశ్వరిని జాన్… pic.twitter.com/Rk6CDTSc6v
— BIG TV Breaking News (@bigtvtelugu) April 15, 2025