BigTV English

Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా అబద్ధం, మళ్లీ ఆ దర్శకుడికే అవకాశం

Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా అబద్ధం, మళ్లీ ఆ దర్శకుడికే అవకాశం

Balakrishna: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ స్టార్ హీరోస్ లో నందమూరి బాలకృష్ణ ఒకరు. ఒకప్పుడు బాలకృష్ణ సినిమాలకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉండేది. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ మధ్య మంచి పోటీ నెలకొనేది. ఒక సందర్భంలో బాలకృష్ణ సినిమాలన్నీ డిజాస్టర్ అవుతూ వచ్చాయి. ఆల్మోస్ట్ బాలకృష్ణ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ బోయపాటి శ్రీను ఎంట్రీ తో సీన్ రివర్స్ అయింది. అప్పటికే బోయపాటి శ్రీను బాలకృష్ణకు సింహా లెజెండ్ వండి హిట్ సినిమాలు ఇచ్చాడు. బాలకృష్ణ పైన అప్పట్లో విపరీతమైన నెగెటివిటీ కూడా వచ్చేది. అయితే ఆహా లో వచ్చిన అన్ స్టాపబుల్ అనే షో తర్వాత బాలకృష్ణ మీద విపరీతమైన పాజిటివిటీ పెరిగింది. ఆ తర్వాత వచ్చిన అఖండ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయం సాధించింది. అక్కడ నుంచి బాలకృష్ణ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చారు.


యంగ్ డైరెక్టర్స్ కు అవకాశం

బోయపాటి శ్రీను (Boyapati Srinu) తీసిన అఖండ సినిమా తర్వాత వరుసగా యంగ్ డైరెక్టర్స్ కు ఛాన్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు బాలయ్య బాబు. అనిల్ రావిపూడి దర్శకుడుగా భగవంతు కేసరి అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ హిట్గా నిలిచింది. బాలకృష్ణ నుంచి ఎటువంటి కమర్షియల్ హంగులు ప్రేక్షకులు కోరుకుంటారో వాటన్నిటిని సమపాళ్లలో పెట్టి సినిమాని తీర్చిదిద్దాడు అనిల్. ఇక ఆ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన వీర సింహారెడ్డి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. సంక్రాంతి కానుక రిలీజ్ అయిన ఈ సినిమా కలెక్షన్స్ ఊచ కోత కోసింది. ఇక ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన డాకుమహారాజు సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో బాబీ చూపించిన యాక్షన్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కూడా సక్సెస్ఫుల్ సినిమాగా పేరు సాధించింది.


మళ్లీ ఆ దర్శకుడికి అవకాశం

రీసెంట్ గా జాట్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. హిందీలో రిలీజ్ అని ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఎటువంటి కమర్షియల్ హంగులు కోరుకుంటారో వాటన్నిటిని కూడా ఆ సినిమాలో పెట్టి నార్త్ లో ఈ సినిమాని సూపర్ హిట్ చేశాడు. ఇక బాలకృష్ణ హరీష్ శంకర్ కాంబినేషన్లో సినిమా ఉంటుంది అని కొన్ని రోజుల నుంచి వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి అయితే దీనిలో ఎటువంటి వాస్తవం లేదు అని తెలుస్తుంది. బాలకృష్ణ మళ్ళీ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమాను చేయనున్నట్లు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. దీని గురించి కొద్ది రోజుల్లో అధికారక ప్రకటన రావాల్సి ఉంది.

Also Read : Allu Arjun: ఆర్య సినిమా స్టార్ట్ అవ్వడానికి, దర్శకుడు వశిష్ట ఫాదర్ ఇంత హెల్ప్ చేశారా.?

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×