Pawan Kalyan : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ వేరు. కొంతమంది హీరోలకి హిట్టు ప్లాపు తో సంబంధం ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ కి మాత్రం అలా ఉండదు. జల్సా సినిమా తర్వాత వరుసగా సినిమాలు డిజాస్టర్ అవుతున్న కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ తగ్గలేదు. రెమ్యూనరేషన్ కూడా తగ్గలేదు. మార్కెట్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జల్సా సినిమా పవన్ కెరియర్ కు అభిమానులకు ఒక పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. ఆ తరువాత హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎటువంటి అంశాలు నచ్చుతాయో వాటన్నిటిని కూడా అద్భుతంగా సినిమాలు పొందుపరిచాడు.
రాజకీయాల్లో బిజీ
పవన్ కళ్యాణ్ సినిమాల్లో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతున్నాడు అనుకునే టైంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం వలన సినిమాల మీద పవన్ కళ్యాణ్ కి ఉన్న కాన్సన్ట్రేషన్ పూర్తిగా తగ్గిపోయింది. కేవలం నామమాత్రంగానే సినిమాలు చేస్తున్నారు గాని ఒకప్పుడు ఉన్నంత డెడికేషన్ లేదు అనేది వాస్తవం. పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరియర్ లో బిజీ అయిన తర్వాత ఎప్పుడు సైన్ చేయనన్ని సినిమాలను సైన్ చేసి లైన్లో పెట్టారు. అయితే వాటిలో కొన్ని సినిమాల్లో మాత్రమే పూర్తి చేశారు. మిగతా సినిమాలు అలా పెండింగ్ లో ఉండిపోయాయి. వాటిలో హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన భగత్ సింగ్ సినిమా కూడా ఒకటి. ఒక పవన్ కళ్యాణ్ ఎప్పుడు డేట్స్ ఇస్తారా అని చాలామంది ఎదురుచూస్తున్నారు. ఇ తరుణంలో పవన్ కళ్యాణ్ కు ఒక కథ చెప్పడానికి ఎదురుచూస్తున్నాడు మరో యంగ్ దర్శకుడు.
దర్శకుడికి క్రాక్
డాన్ శీను సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు గోపీచంద్ మలినేని. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఇప్పటివరకు గోపీచంద్ మలినేని తీసిన అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి రిజల్ట్ ని అందుకున్నాయి. స్టార్ హీరో బాలయ్య బాబుతో కూడా మంచి హిట్ ట్రాక్ ఉంది. అయితే ప్రస్తుతం గోపీచంద్ మలినేని పవన్ కళ్యాణ్ హీరోగా ఒక సినిమాను ప్లాన్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న సినిమాలను చేయడానికి ఆలోచనలో ఉన్నారు. మరి అలాంటప్పుడు ఇంకో దర్శకుడికి అవకాశం ఎలా ఇస్తారు అనేది చాలామంది ఆలోచన, దీనిని పరిగణలోకి తీసుకొని ఆ దర్శకుడికి ఏమైనా క్రాక్ ఉందా? పవన్ కళ్యాణ్ తో సినిమా ప్లాన్ చేసి టైం వేస్ట్ చేసుకుంటారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
Also Read : Ss Rajamouli: జక్కన్ననే వెయిట్ చేయిస్తున్న సినిమాలు ఇవే… ఈ లిస్ట్ మీరు కూడా చూడండి