Natural Star Nani: నాచురల్ స్టార్ నాని (Nani) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇండస్ట్రీలోకి ఎవరి సపోర్టు లేకుండా వచ్చి తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు స్టార్ హీరో గానే కాకుండా నిర్మాతగా కూడా చిన్న చిన్న చిత్రాలు నిర్మిస్తూ తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఇటీవలే ‘కోర్ట్’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన నాని ఇప్పుడు ‘హిట్ 3’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్లో జోరుగా పాల్గొంటున్న నాని.. అందులో భాగంగానే ఆ సినిమాలో కొన్ని సన్నివేశాలలో తన నటన తనకే నచ్చలేదు అంటూ కామెంట్స్ చేశారు.
ఆ సినిమాలో నా యాక్టింగ్ నాకే నచ్చలేదు – నాని
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), నాని (Nani) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఎవడే సుబ్రహ్మణ్యం’. నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.ఇటీవలే పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా టీం మొత్తం రీ యూనియన్ నిర్వహించింది. అలాగే ఈ సినిమా కోసం పనిచేసిన వారందరూ కూడా కలిశారు. అక్కడ నాని చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్య పరిచాయి. పదేళ్ల తర్వాత టీమ్ అందర్నీ కలుసుకోవడం ఎమోషనల్ గా ఉందని తెలిపిన నాని.. విజయ్, నేను, నాగ్ అశ్విన్ ఇప్పటికీ కూడా టచ్ లోనే ఉన్నాము. వీలు కుదిరినప్పుడల్లా మాట్లాడుకుంటూ ఉంటాము. సినిమా విడుదలైనప్పుడు అటు కామెంట్స్ కూడా పంచుకుంటాము. పదేళ్ల తర్వాత టీమ్ అంతా కూడా ఒకే చోట కలవడం చాలా ఆనందంగా ఉంది. స్కూల్ రీ యూనియన్ లా అనిపిస్తోంది. మా సినిమా కోసం పనిచేసిన వాళ్లు ఇప్పుడు చాలా పెద్ద వాళ్ళు అయ్యారు. ఈ సినిమాను ఇప్పుడు ప్రదర్శించారు. నా పాత్ర చూసిన తర్వాత అందులో కొన్ని సన్నివేశాలు నాకే నచ్చలేదు. బాధగా అనిపించింది. ఇంకాస్త బెటర్ గా చేసింటే బాగుండేదేమో అనే ఫీలింగ్ కూడా కలిగింది”. అంటూ నాని తెలిపారు.మొత్తానికి నాని చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
నాని కెరియర్..
నాని విషయానికి వస్తే శ్రీనువైట్ల, బాపు వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఆ తర్వాత హైదరాబాద్లో కొన్ని రోజులు రేడియో జాకీగా పని చేసిన ఈయన, ఒక వాణిజ్య ప్రకటన ద్వారా ‘అష్టా చమ్మా’ సినిమాలో హీరోగా అవకాశాన్ని అందుకున్నారు. ఆ తర్వాత నానికి ‘ఈగ’ సినిమాలో అవకాశం వచ్చి, అటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. ఇక ఇప్పుడు ఉన్న హీరోల్లో నాని నటనతో నాచురల్ స్టార్ గా పిలవబడుతున్నారు. 2015లో వచ్చిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ మొదలు 2017లో వచ్చిన ‘ఎంసీఏ’ చిత్రం వరకు వరుసగా ఎనిమిది విజయాలు అందుకున్నారు. 2014లో నాని నిర్మాతగా ‘ఢీ ఫర్ దోపిడీ’ అనే చిత్రాన్ని నిర్మించారు. ఇక అలా వరుసగా ఒకవైపు హీరోగా, మరొకవైపు నిర్మాతగా సినిమాలు చేస్తూ మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నారు నాని.
ALSO READ:Kasthuri Shankar: రాత్రి 9 అయితే చాలు ఆగలేకపోతున్నా.. కస్తూరీ బో*ల్డ్ కామెంట్..!