BigTV English

SSMB 29: రాజమౌళి సినిమా రిస్క్ ఆ రేంజులోనే ఉంటుంది

SSMB 29: రాజమౌళి సినిమా రిస్క్ ఆ రేంజులోనే ఉంటుంది

SSMB 29 :  ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్థాయిని హాలీవుడ్ వరకూ తీసుకోని వెళ్లింది. ఈ మాస్టర్  పీస్ తో రాజమౌళి సృష్టించిన సంచనలం ఇండియాకి ఆస్కార్ ని తెచ్చింది. ప్రపంచం మొత్తం నాటు నాటు సాంగ్ కి డాన్స్ వేసేలా చేసిన జక్కన్న, హాలీవుడ్ గడ్డపై నిలబడి తన నెక్స్ట్ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉంటుంది అని అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఇండియానా జోన్స్ స్టైల్ లో ఉండే గ్లోబ్ ట్రాటింగ్ సినిమాని మహేష్ బాబుతో ప్లాన్ చేసిన జక్కన, అందుకు తగ్గట్లుగానే ప్రియాంక చోప్రాని ప్రాజెక్ట్ లోకి తెచ్చాడు.


మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, రాజమౌళి… ఈ మూడు పేర్లు వరల్డ్ ఆడియన్స్ ని గ్లోబ్ ట్రాటింగ్ సినిమా వైపు తిప్పింది. ఒక హాలీవుడ్ స్టార్ హీరో కూడా ఈ  సినిమాలో ఉంటాడు అనే టాక్ ఉంది కానీ ఇంకా ఎలాంటి అప్డేట్ బయటకి రాలేదు. పూజా కార్యక్రమాలు కంప్లీట్ చేసి, ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేసాడు రాజమౌళి. ఫస్ట్ షెడ్యూల్ ని ఓడిస్సాలో ఇన్ డోర్ లోకేషన్స్ లో కంప్లీట్ చేసి సెకండ్ షెడ్యూల్ కోసం అవుట్ డోర్ వెళ్లడానికి చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

ఒక యాక్షన్ ఎపిసోడ్ ని ప్రియాంక చోప్రా, మహేష్ బాబు, ఇతర ఆర్టిస్టులతో ఫస్ట్ షెడ్యూల్ లో కంప్లీట్ చేసారని సమాచారం. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోస్ లో మహేష్ బాబు సూపర్బ్ గా ఉన్నాడు. దాదాపు పదేళ్ల తర్వాత మహేష్ బాబు కష్టపడే సినిమా స్టార్ట్ అయ్యిందనే చెప్పాలి. ఇప్పటివరకూ ఫారిన్ కి ఫ్యామిలీ ట్రిప్స్ కి మాత్రమే వెళ్లిన మహేష్ బాబు, ఇప్పుడు రాజమౌళి సినిమా కోసం ప్రపంచం మొత్తం తిరగానున్నాడు.


సెకండ్ షెడ్యూల్ కి అవసరమైన సెట్ వర్క్ ఇప్పటికే జరగడంతో… ఎన్ని రోజుల్లో ఆ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది అనేది ఇంటరెస్టింగ్ విషయంగా మారింది. ఇక శ్రీమంతుడు సినిమా నుంచి సెటిల్డ్ రోల్స్ మాత్రమే చేస్తూ రీజనల్ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్స్ కొడుతున్న మహేష్ బాబు, రాజమౌళి సినిమా కోసం కష్టపడతాడా అనే డౌట్ అందరిలో ఉండేది. ఆ డౌట్ ని చెరిపేస్తూ మహేష్ బాబు సాలిడ్ ఫిజిక్ తో రెడీ అయ్యాడు. ఇప్పటివరకూ చూడని మహేష్ బాబుని రాజమౌళి సినిమాలో చూడబోతున్నాం.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×