SSMB 29 Shooting Update: ప్రస్తుతం చాలావరకు తెలుగు హీరోలకు పాన్ ఇండియా స్టార్‌డమ్ ఉంది. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయిలో హిట్ అయ్యేలా చేసి తమ ఫ్యాన్ బేస్‌ను పెంచుకుంటున్నారు. కానీ తెలుగు దర్శకుల్లో పాన్ ఇండియా అనే ట్యాగ్ ఒక్కరికి మాత్రమే సొంతమయ్యింది. అదే రాజమౌళి. ఈయన ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమాలతో పాన్ ఇండియా డైరెక్టర్ అనే ట్యాగ్‌ను సొంతం చేసుకున్నారు. ఆయనతో ఏ హీరో కలిసి వర్క్ చేసినా వారికి కూడా దేశవ్యాప్తంగా పాపులారిటీ ఖాయమనే ఆలోచనను క్రియేట్ చేశారు. అందులో భాగంగానే ఇప్పుడు మహేశ్ బాబుతో రాజమౌళి చేస్తున్న సినిమాలపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
అవన్నీ రూమర్సే
రాజమౌళి (Rajamouli) ఏ సినిమా చేసినా దానికి ప్రీ ప్రొడక్షన్ పక్కా ఉండేలా చూసుకుంటారు. ప్రీ ప్రొడక్షన్‌తో ఆయన తృప్తిపడితేనే షూటింగ్ మొదలుపెడతారు. అలాగే 2024 మొదలయినప్పటి నుండి మహేశ్ బాబు అప్‌కమింగ్ మూవీ ఎస్‌ఎస్ఎమ్‌బీ 29 సినిమా ప్రీ ప్రొడక్షన్‌లోనే బిజీగా ఉన్నారు రాజమౌళి. అప్పుడప్పుడు దీనికి సంబంధించిన అప్డేట్స్‌ను కూడా బయటపెట్టారు. అంతే కాకుండా ఇప్పటికే మహేశ్, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కే మూవీ గురించి ఎన్నో రూమర్స్ కూడా వచ్చాయి. అయినా షూటింగ్ కూడా ప్రారంభం కాకముందే వచ్చే రూమర్స్‌ను చాలామంది ప్రేక్షకులు నమ్మలేదు. ఫైనల్‌గా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అప్డేట్ బయటికొచ్చింది.
Also Read: క్రిస్మస్ రేసు నుండి తప్పుకున్న ‘రాబిన్‌హుడ్’.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే.?
అప్డేట్స్ కావాలి
2025లో ఎలాగైనా ఈ సినిమాను ప్రారంభించాలని మహేశ్ బాబుతో పాటు రాజమౌళి కూడా ఫిక్స్ అయ్యారట. అందుకే సంక్రాంతి తర్వాత ఎస్ఎస్ఎమ్‌బీ 29 సెట్స్‌పైకి వెళ్లనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమయితే షూటింగ్ ప్రారంభమయిన తర్వాత ఈ సినిమా గురించి మరికొన్ని అప్డేట్స్ బయటికొస్తాయని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. ఇప్పటికే రాజమౌళితో చేసే సినిమా కోసం కసరత్తులు మొదలుపెట్టాడు మహేశ్. ఈ మూవీ కోసమే జుట్టు పెంచేశాడు. ఈ కొత్త లుక్‌లో మహేశ్ చాలా బాగున్నాడని ప్రేక్షకులు అనుకుంటూ ఉన్నారు. ఇక వెండితెరపై ఈ లుక్‌తోనే మహేశ్ బాబు (Mahesh Babu) రికార్డులను బ్రేక్ చేస్తాడని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. ఇప్పటికే కేవలం తెలుగులోనే సినిమాలు చేస్తూ ఎన్నో రికార్డులు బ్రేక్ చేశాడు మహేశ్.
ఎప్పుడు విడుదల అవుతుందో.?
మహేశ్ బాబు చివరిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గుంటూరు కారం’ సినిమాతో అలరించాడు. ఈ మూవీ 2024 సంక్రాంతికి విడుదలయ్యింది. సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. ఇందులో మహేశ్ బాబు తన యాక్షన్‌తో అందరినీ ఎంటర్‌టైన్ చేశాడు. ‘గుంటూరు కారం’ విడుదలయిన తర్వాత పూర్తిగా రాజమౌళి సినిమా కోసమే ప్రిపరేషన్ మొదలుపెట్టాడు మహేశ్. 2026లో ఎస్ఎస్ఎమ్‌బీ 29 విడుదల అవుతుందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. కానీ రాజమౌళి సినిమా అంటే ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పుడు విడుదల అవుతుందో చెప్పడం కష్టమంటూ ఫన్నీగా సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. మొత్తానికి సంక్రాంతి తర్వాత ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందనే వార్త మహేశ్ ఫ్యాన్స్‌ను హ్యాపీ చేస్తోంది.