
SSMB 29:న్యూ ఇయర్‌ని ఫారిన్‌లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు సూపర్‌స్టార్ మహేష్‌బాబు. 2022లో తల్లిదండ్రులు ఇద్దరినీ, తోడ బుట్టిన రమేష్‌బాబును పోగొట్టుకున్నారు మహేష్. అందుకే సినిమా షూటింగులకు కూడా దూరంగా ఉన్నారు. త్రివిక్రమ్ సినిమా మొదలయ్యినట్టే మొదలైనా, వెంటనే తల్లిదండ్రులను పోగొట్టుకోవడంతో కోలుకోలేకపోయారు మహేష్. అందుకే షూటింగులకు గ్యాప్ ఇచ్చి ఫారిన్‌కి వెళ్లారు. తిరిగి వచ్చాక ఏకంగా 60 రోజులు నాన్‌స్టాప్‌గా త్రివిక్రమ్ కోసం కాల్షీట్ కేటాయిస్తానని,ఆల్ అరేంజ్‌మెంట్స్ చేసుకోమని మాట ఇచ్చేశారట మహేష్. త్రివిక్రమ్ బ్యాచ్ మొత్తం ఇప్పుడు అన్నీ పనులు అరేంజ్ చేసే బిజీలో ఉన్నారు.
ఆగస్టులోపు త్రివిక్రమ్ సినిమాకు గుమ్మడికాయ కొట్టేయాలన్నది మహేష్ ప్లాన్. ఆ తర్వాతే ఆయన రాజమౌళి సినిమా మీద కాన్‌సెన్‌ట్రేట్ చేస్తారట. 2023 ఆగస్టు నుంచి రాజమౌళి సినిమా ప్రారంభం కానుందట. మొదట మహేష్ లేని కొన్ని ఎపిసోడ్స్ కంప్లీట్ చేసినా, ఆ వెంటనే మహేష్ షెడ్యూల్స్ కూడా ప్లాన్ చేస్తున్నారట జక్కన్న. ఎలాంటి ఎమోషన్స్ లేని ఓ ట్రావెలర్ పాత్రలో మహేష్ కనిపిస్తారట. జేమ్స్ బాండ్ తరహా కేరక్టర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయనే ఫీలర్స్ వినిపిస్తున్నాయి.
500 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారట కేఎల్ నారాయణ. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ మీద ప్రెస్టీజియస్‌గా తెరకెక్కించనున్నారు ఈ సినిమాను. ఇప్పటికే మహేష్ మూవీ కోసం కీరవాణి కొన్ని ట్యూన్లు కూడా అనుకుంటున్నారట. మరోవైపు పెద్దాయన విజయేంద్రప్రసాద్ కథను తీర్చిదిద్దే పనుల్లో ఉన్నారు. సంక్రాంతి తర్వాత ఓ సారి ఫస్టాఫ్ విందామని డిసైడ్ అయ్యారట ఎస్.ఎస్.రాజమౌళి. సో 2023 స్టార్ట్ అయిన వెంటనే నాన్‌స్టాప్‌గా పనుల్లో మునిగిపోతారు మహేష్.
Perni Nani press meet: చంద్రబాబుకు 118 కోట్ల లంచం.. ఐటీ నోటీసులపై పేర్ని ప్రశ్నలు