రివ్యూ : ‘హవోక్’ తెలుగు డబ్బింగ్ ఇంగ్షీషు యాక్షన్ డ్రామా
ఓటీటీ : నెట్ ఫ్లిక్స్
నటీనటులు : టామ్ హార్డీ, జెస్సీ మెయి లి, ఫారెస్ట్ విటేకర్, టిమోతీ ఒలిఫాంట్, యెయో యాన్ యాన్ తదితరులు
దర్శకుడు : గారెత్ ఎవాన్స్
Havoc Movie Review : “హవోక్” (Havoc) అనే యాక్షన్ డ్రామా నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో ఏప్రిల్ 25 అంటే ఈరోజు నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి గారెత్ ఇవాన్స్ దర్శకత్వం వహించగా… టామ్ హార్డీ, జెస్సీ మై లీ, ఫారెస్ట్ విటేకర్, టిమోతీ ఒలిఫాంట్ వంటి నటీనటులు ప్రధాన పాత్రల్లో నటించారు. 1 గంట 47 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా రిలీజ్ కావడం విశేషం. మరి ఈ మూవీ ఎంత వరకు ఆకట్టుకుందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ
‘హవోక్’ కథ ఒక డ్రగ్ డీల్ లో దెబ్బతిన్న డిటెక్టివ్ వాకర్ (టామ్ హార్డీ) చుట్టూ నడుస్తుంది. అండర్ వరల్డ్ లోకి ప్రవేశించి, ఒక రాజకీయ నాయకుడి కొడుకును రక్షించేందుకు వాకర్ ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అతను పోలీసులు, ఒక గ్యాంగ్ లీడర్… ఆఖరికి తన గతంతో కూడా పోరాడాల్సి వస్తుంది. ఈ కథలో అవినీతి, కుట్రలు, ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. ఇంతకీ వాకర్ ఆ అబ్బాయిని కాపాడగలిగాడా ? హీరో గతం ఏంటి? పోలీసుల నుంచి, అండర్ వరల్డ్ నుంచి అతనికి ఎదురైన సమస్యలు ఏంటి? అనే విషయాలు తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే.
విశ్లేషణ
హీరో టామ్ హార్డీ తన పాత్రలో ఎప్పటిలాగే ఆకట్టుకున్నాడు. వాకర్ గా ఆయన ఇంటెన్స్ యాక్టింగ్, ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో నటించిన తీరు ఆకట్టుకుంటుంది. అలాగే జెస్సీ మై లీ, ఫారెస్ట్ విటేకర్ కూడా తమ పాత్రల్లో అదరగొట్టారు. గారెత్ ఇవాన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ సీక్వెన్స్ లు యాక్షన్ మూవీ లవర్స్ కు మంచి ట్రీట్. “ది రైడ్” సిరీస్ తో పాపులర్ అయిన ఇవాన్స్, ఈ చిత్రంలో కూడా తనదైన ముద్ర వేశాడు. ప్రతి ఫైట్ సీన్ ను ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు మేకర్స్. సినిమాటోగ్రఫీ ద్వారా అండర్ వరల్డ్ వాతావరణాన్ని సక్సెస్ ఫుల్ గా క్రియేట్ చేయగలిగారు. సంగీతం కథనానికి తగ్గట్టుగా ఉత్కంఠను పెంచింది, అయితే కొన్ని చోట్ల అతిగా అన్పిస్తుంది. ఇక కథ విషయానికొస్తే… సాధారణ యాక్షన్ థ్రిల్లర్ ఫార్ములాను ఫాలో అయ్యారు. కానీ అవినీతి, కుట్రల చుట్టూ తిరిగే సబ్ ప్లాట్ లు ఆసక్తిని రేకెత్తిస్తాయి. అయితే కొన్ని పాత్రలు, క్లైమాక్స్ ఊహకు అందేలా ఉండడం నిరాశ పరుస్తుంది. అలాగే తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది.
ప్లస్ పాయింట్స్
టామ్ హార్డీ నటన
పవర్ ఫుల్ యాక్షన్ సన్నివేశాలు.
సినిమాటోగ్రఫీ
ఉత్కంఠభరితమైన కథనం
మైనస్ పాయింట్స్
కథలో కొత్తదనం కొరవడింది (రొటీన్ యాక్షన్ ఫార్ములా)
కొన్ని పాత్రలు
Read Also : ‘జువెల్ థీఫ్- ది హీస్ట్ బిగిన్స్’ మూవీ రివ్యూ
చివరగా
‘హవోక్’ యాక్షన్ థ్రిల్లర్ అభిమానులు చూడాల్సిన మస్ట్ వాచ్ మూవీ, ఈ వీకెండ్ కు మంచి యాక్షన్ ట్రీట్. కానీ కథలో కొత్తదనం కోరుకునే వారికి నిరాశ కలిగించవచ్చు.
Havoc Movie Rating : 2/5