BigTV English

SSMB 29: మ‌హేష్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్‌.. జ‌క్క‌న్న మొద‌లెట్టేది అప్పుడేన‌ట‌!

SSMB 29: మ‌హేష్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్‌.. జ‌క్క‌న్న మొద‌లెట్టేది అప్పుడేన‌ట‌!

SSMB 29:సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఇప్పుడు రెండు క్రేజీ ప్రాజెక్టుల‌ను లైన్‌లో పెట్టిన సంగ‌తి తెలిసిందే. అందులో ఒక‌టి త్రివిక్రమ్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న SSMB 28 (వ‌ర్కింగ్ టైటిల్‌). ఆల్ రెడీ ఈ సినిమా సెట్స్‌పై ఉంది. ఇది కాకుండా పాన్ ఇండియా నెంబ‌ర్ వ‌న్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రాజ‌మౌళి త‌న తండ్రి, స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్‌తో స్టోరి సిద్ధం చేసే ప‌నిలో బిజీగా ఉన్నారు. సినిమా జోన‌ర్ కూడా ఏంటో చెప్పేశారు. గ్లోబ్ ట్రాటింగ్‌గా ఇండియానా జోన్స్ త‌ర‌హా యాక్ష‌న్ అడ్వెంచర‌స్ మూవీని మ‌హేష్‌తో తెర‌కెక్కించాల‌నుకుంటున్న‌ట్లు ఇటీవ‌ల ద‌ర్శ‌క‌ధీరుడు ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు.


కాగా.. ఈ సినిమా రైట‌ర్ అయిన విజ‌యేంద్ర ప్ర‌సాద్ సినిమా గురించి ఆస‌క్తిక‌ర‌మైన మ‌రో విష‌యాన్ని రివీల్ చేశారు. మ‌హేష్ – రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో తెరకెక్క‌బోతున్న SSMB 29 పాన్ వ‌రల్డ్ మూవీగా ఆడియెన్స్‌ని అల‌రించ‌నుంది. ‘నేను మహేష్‌ని దృష్టిలో పెట్టుకునే ఈ క‌థ‌ను సిద్ధం చేస్తున్నాను. యాక్ష‌న్ అడ్వెంచ‌ర‌స్ మూవీ చేయాల‌ని రాజ‌మౌళి ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నారు. ఇప్ప‌టికి కుదిరింది. ప్ర‌పంచ వ్యాప్తంగా డిఫ‌రెంట్ ప్లేసెస్‌లో సినిమాను చిత్రీక‌రించాల‌ని అనుకుంటున్నాం. జూన్ నుంచి సినిమా షూటింగ్ మొద‌ల‌య్యే అవ‌కాశం ఉంది’’ అన్నారు.

ఇది నిజంగా మ‌హేష్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూసే. రాజ‌మౌళితో సినిమా అంటే ఇప్ప‌డు పాన్ ఇండియా ఆడియెన్సే కాదు.. పాన్ వ‌ర‌ల్డ్ ఆడియెన్స్ కూడా ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటార‌న‌టంలో సందేహం లేదు. ఇండియా నుంచి పాన్ వ‌రల్డ్ మూవీగా రాబోయే తొలి సినిమా SSMB 29 అవుతుంద‌ని సినీ సర్కిల్స్ టాక్‌.


Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×