Hyper Aadi: హైపర్ ఆది (Hyper Aadi)పరిచయం అవసరం లేని పేరు. ఐటి ఉద్యోగిగా కొనసాగుతున్న హైపర్ ఆది సినిమాలపై ఆసక్తితో జబర్దస్త్ (Jabardasth) కార్యక్రమంలోకి అడుగుపెట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మొదట్లో స్క్రిప్ట్ రైటర్ గా పని చేసిన అనంతరం కమెడియన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి తన కామెడీ డైలాగులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేవారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా అతి తక్కువ సమయంలోనే స్టార్ కమెడియన్ గా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న హైపర్ ఆది ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారు. ఇక ఈయన శ్రీదేవి డ్రామా కంపెనీ(Sridevi Drama Company) కార్యక్రమంతో పాటు ఢీ డాన్స్ షో కార్యక్రమంలో పాల్గొంటూ ఎప్పటిలాగే తన పంచ్ డైలాగులతో అందరినీ నవ్విస్తున్నారు.
నువ్వు నాకు నచ్చావ్…
శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం ప్రతి ఆదివారం మధ్యాహ్నం ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ కార్యక్రమానికి నటి ఇంద్రజ జడ్జిగా వ్యవహరించగా రశ్మి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్రోమో విడుదల చేశారు. ఇక ఈ ప్రోమోలో భాగంగా సీనియర్ నటుడు పృథ్వీరాజ్ హాజరయ్యారు. ఇక ఇందులో నువ్వు నాకు నచ్చావ్ సినిమాకు సంబంధించిన పాటలకు డాన్సులు వేయడం కొన్ని సన్నివేశాలను రి క్రియేట్ చేయడం జరిగింది. ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా బుల్లితెర నటీనటులు శివకుమార్(Shiva Kumar), ప్రియాంక జైన్(Priyanka Jain) కూడా పాల్గొన్నారు.
రేటింగ్ కోసమే రిలేషన్…
ఎప్పటిలాగే కామెడీ డైలాగులతో ఆటపాటలతో ఈ ప్రోమో సరదాగా సాగిపోయింది. ఇక చివరిలో హైపర్ ఆది ప్రియాంక ,శివకుమార్ ను ప్రశ్నిస్తూ.. నేను మిమ్మల్ని చాలా జెన్యూన్ గా ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పండి చాలా మంది రేటింగ్స్ కోసమే రిలేషన్ లో ఉన్నట్టు నటిస్తుంటారు అలా మీరు కూడా రేటింగ్ కోసమే రిలేషన్ లో ఉన్నారా? అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఒక్కసారిగా శివకుమార్ ప్రియాంక షాక్ లో ఉండిపోయారు. అలాగే మీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా? అంటూ కూడా హైపర్ ఆది ప్రశ్నించారు.
ఈ విధంగా హైపర్ ఆది వీరి గురించి ఇలా మాట్లాడటంతో ఒక్కసారిగా శివకుమార్ హైపర్ ఆదితో మాట్లాడుతూ మేము నిజంగా రిలేషన్ లో ఉన్నామా? లేదా? అనేది నీకు ప్రూఫ్ చేయాలి అంతే కదా ఇక్కడే మీ ముందే పెళ్లి చేసుకుంటాం అంటూ ప్రియాంక మెడలో అందరి ముందు తాళి కట్టడంతో ఒక్కసారిగా అందరూ షాక్ లో ఉండిపోయారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇది కేవలం రేటింగ్స్ కోసం చేసే స్టంట్ మాత్రమే అంటూ కొంతమంది కామెంట్ లు చేయగా, మరి కొందరు మాత్రం ఇలా షోలలో తప్ప నిజ జీవితంలో ఆమె మెడలో మీరు తాళికట్టరా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే మౌనరాగం సీరియల్ సమయం నుంచి వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నప్పటికీ ఇంకా పెళ్లి గురించి మాత్రం ఆలోచన చేయకపోవడంతోనే వీరికి తరచూ ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి.
Also Read: కమల్ కు భారీ ఊరట.. క్షమాపణలు వద్దు థగ్ లైఫ్ విడుదల చేయాల్సిందే!