Kamal Haasan: కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకొని .. ఆ తర్వాత తన నటనతో విశ్వ నటుడిగా పేరు సొంతం చేసుకున్న కమలహాసన్ (Kamal Haasan) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈ వయసులో కూడా యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొడుతూ.. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ముఖ్యంగా 70 ఏళ్ల వయసులో కూడా యాక్టింగ్ పై మక్కువతో వరుస సినిమాలలో నటిస్తూ.. బిజీగా మారిన ఈయన.. త్వరలో థగ్ లైఫ్ (Thug Life) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలోనే నిన్న ఫస్ట్ సాంగ్ ‘జింగిచా’ అంటూ లిరికల్ సాంగ్ విడుదల చేయగా.. పెళ్లి ఈవెంట్ కు సంబంధించిన ఈ పార్టీ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఈ సినిమా జూన్ 5 తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో తాజాగా కమలహాసన్ తన అభిమానులకు క్షమాపణలు చెప్పారు. మరి అసలు ఏమైందో ఇప్పుడు చూద్దాం.
సినీ ప్రియలకు క్షమాపణలు చెప్పిన కమలహాసన్..
అసలు విషయంలోకెళితే.. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా నుండి మొదటి పాటను విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమా పాట ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన కమలహాసన్ సినీ ప్రియులకు క్షమాపణలు చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. “నేను, దర్శకుడు మణిరత్నం(Maniratnam ) కలిసి చాలా ఏళ్ల క్రితమే కలిసి పని చేయాల్సి ఉంది. ఇది చాలా సంవత్సరాలుగా సినీ ప్రియులు చేస్తున్న డిమాండ్. కానీ వ్యక్తిగత కారణాలవల్ల మేము కలిసి పని చేయలేకపోయాము. అది మా తప్పే. దయచేసి దానికి నేను క్షమాపణలు కోరుతున్నాను” అంటూ కమలహాసన్ తెలిపారు. ఇకపోతే గతంలో కమలహాసన్ – మణిరత్నం దర్శకత్వం లో ” నాయగన్ ” అనే సినిమా మాత్రమే వచ్చింది. ఈ సినిమా అప్పట్లో ఒక కల్ట్ క్లాసిక్ మూవీ. ఇక ఈ సినిమా తర్వాత మళ్లీ వీళ్ళ కాంబోలో సినిమాలు రావాలని అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. కానీ అది జరగలేదు. ముఖ్యంగా ఇద్దరి మధ్య విభేదాల కారణంగానే కలిసి పని చేయలేదని రూమర్స్ వచ్చాయి. ఇక ఇలాంటి సమయంలోనే ఇప్పుడు మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్లో థగ్ లైఫ్ లైఫ్ సినిమా వస్తోంది. అందుకే దీనిని దృష్టిలో పెట్టుకొని ఆయన ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని చెప్పవచ్చు.
థగ్ లైఫ్ మూవీ విశేషాలు..
ఇక థగ్ లైఫ్ విషయానికి వస్తే.. ఈ సినిమాలో త్రిష కృష్ణన్ (Trisha Krishnan), శింబు (Simbu) తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా లోని మొదటి పాట విడుదల చేయగా ఈ పాటకి కమలహాసన్ లిరిక్స్ అందించడం జరిగింది. ఇక ఇలా ఎప్పటికప్పుడు తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటున్న కమలహాసన్ ఈ సినిమాతో మరో విజయాన్ని అందుకోవాలని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి జూన్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. అటు త్రిష కూడా ఈ సినిమా సక్సెస్ కోసం భారీగా ఎదురుచూస్తోంది.
Kalyani Priyadarshan: మోహన్ లాల్ ఇంటికి కోడలు కావడంపై.. క్లారిటీ ఇచ్చేసిన ప్రియదర్శన్ తల్లి..!