BigTV English

Star Hero: స్నేహమంటే ఇదేరా… మెగాస్టార్ కోసం మోహన్ లాల్ ఊహించని పని..!

Star Hero: స్నేహమంటే ఇదేరా… మెగాస్టార్ కోసం మోహన్ లాల్ ఊహించని పని..!

Star Hero:ప్రముఖ మలయాళ స్టార్ నటులు మోహన్ లాల్ (Mohan Lal),ప్రస్తుతం పృథ్వీ రాజ్ (Prithvi Raj) దర్శకత్వంలో ‘లూసిఫర్ 2 ఎంబురాన్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ప్రో డాడీ, లూసిఫర్ తర్వాత ఈ ఇద్దరు కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా ఈ సినిమా లూసిఫర్ చిత్రానికి రెండవ పార్ట్ కావడం గమనార్హం. ఇక ఈ సినిమా 2025 మార్చ్ 27వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతోంది. ఒక ఈ సినిమాలో మోహన్ లాల్, టోవినో థామస్, ఇంద్రజిత్, సూరజ్ వెంజరమూడు, మంజు వారియర్, కిషోర్ తో పాటు పలువురు కీలకపాత్రను పోషిస్తున్నారు. ఇంతటి భారీ తారాగణంతో రాబోతున్న సినిమాపై అంచనాలు కూడా అంతే విపరీతంగా పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాను తమిళంలో లైకా ప్రొడక్షన్ వారు విడుదల చేస్తున్నారు.


మమ్ముట్టి కోసం మోహన్ లాల్ అలాంటి పని..

ఇదిలా ఉండగా మార్చి 27 -2025 లో సినిమా విడుదల కానున్న నేపథ్యంలో మోహన్ లాల్ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాన్ని సందర్శించి దేవుడిని దర్శనం చేసుకున్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మోహన్ లాల్, మమ్ముట్టి పేరు మీద పూజలు చేయించడం వైరల్ గా మారుతోంది. ముఖ్యంగా ఆ పూజకు సంబంధించిన రసీదు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత కొన్ని రోజులుగా నటుడు మమ్ముట్టి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, అందుకే హాస్పిటల్లోనే చికిత్స తీసుకుంటున్నారని, ఈ క్రమంలోనే ఆయన షూటింగ్లో కూడా పాల్గొనడం లేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో నటుడు మోహన్ లాల్, మమ్ముట్టి పేరుమీద పూజలు చేయించినట్లు సమాచారం. మొత్తానికి అయితే ఇప్పుడు ఈ ఇద్దరి స్టార్ హీరోల అభిమానుల మధ్య సాన్నిహిత్యం కూడా మరింత బలమైంది అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ పూజా కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి అధికారిక సమాచారం వెలువడ లేదు. కానీ ఆ ఒక్క రసీదు ఇప్పుడు ఈ వార్తలకు కారణమయ్యింది. ఇకపోతే అటు మోహన్ లాల్ కూడా శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో పూజలు చేయించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.


క్యాన్సర్ తో బాధపడుతున్న మమ్ముట్టి.. క్లారిటీ ఇచ్చిన టీమ్..

ఇదిలా ఉండగా గత కొన్ని రోజుల క్రితం.. మమ్ముట్టికి క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని, దానికి చికిత్స పొందుతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవ్వగా .. ఆ వార్తలపై ఆయన టీం స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఇక ఇప్పుడు మోహన్ లాల్, మమ్ముట్టి కలిసి మల్టీ స్టారర్ గా ఒక సినిమా చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఏదేమైనా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఒకే సినిమాలో నటించబోతున్నారని తెలిసి అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇలాంటి సమయంలో మమ్ముట్టి కోసం మోహన్ లాల్ ప్రత్యేకంగా పూజలు చేయించడం మరో ఎత్తు. అన్నీ కలిసి స్నేహమంటే ఇదేరా అనే సాంగ్ కూడా గుర్తుకొస్తోందని అభిమానులు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మరి వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే మల్టీస్టారర్ మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Betting Apps : మరో 6 గురికి నోటీసులు… శభాష్ పోలీస్… ఒక్కొక్కరి భరతం పడుతున్నారు..!

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×