Aishwarya Rajesh..ఎవరైనా సరే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలనుకునే ముందు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా నటనలో శిక్షణ తీసుకున్న తర్వాత.. తమ ఫోటోలను వెంటపెట్టుకొని మరీ ఆఫీసుల చుట్టూ తిరిగిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అలా ప్రతి ఒక్క హీరోకైనా , హీరోయిన్ కైనా ఫస్ట్ ఫోటో షూట్ అనేది తప్పనిసరి. ఆ ఫోటోలు బాగుంటేనే వారిని చూసి సినిమాలలో తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా పగడ్బందీగా అందంగా తయారై, ఆ ఫోటోలను తీసుకుంటూ ఉంటారు. ఇకపోతే అందరి సెలబ్రిటీలు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఒకలాగా.. ఏళ్లు గడిచేకొద్దీ మరొకలాగా కనిపిస్తూ ఉంటారనటంలో సందేహం లేదు. అయితే ఇప్పుడు కూడా ఒక తెలుగు హీరోయిన్ ఏకంగా తన తొలి ఫస్ట్ ఫోటో షూట్ ని షేర్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచింది.
ఐశ్వర్య రాజేష్ ఫస్ట్ ఫోటో షూట్ ఫోటో వైరల్..
ఆమె ఎవరో కాదు ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) . తాజాగా తన సోషల్ మీడియా ఖాతా ఇంస్టాగ్రామ్ స్టోరీలో తన ఫస్ట్ ఫోటోషూట్ అంటూ ఒక ఫోటోని పంచుకుంది. ఇందులో ఈమె అందం చూసి బాలీవుడ్ బ్యూటీ అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్. ఈమె పేరుకే తెలుగమ్మాయి కానీ ఫస్ట్ ఫోటో షూట్ ఏంటి.. బాలీవుడ్ హీరోయిన్ రేంజ్ లో చేసింది అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.. ఏది ఏమైనా ఐశ్వర్య రాజేష్ కి సంబంధించిన ఈ ఫస్ట్ ఫోటో షూట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
also read: Rashmika: రష్మికకి చెక్ పెట్టనున్న గ్లోబల్ స్టార్.. అయోమయంలో నేషనల్ క్రష్..!
ఐశ్వర్య రాజేష్ కెరియర్..
ఇక ఐశ్వర్య రాజేష్ విషయానికి వస్తే.. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాలలో నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా తెలుగులో రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన రాంబంటు సినిమాలో నటించి తెలుగు ఆడియన్స్ను ఆకట్టుకుంది. ఇక తర్వాత హాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకున్న ఈమె.. తొలిసారి తెలుగులో ‘కౌసల్య కృష్ణమూర్తి’ అనే సినిమాతో హీరోయిన్ గా అడుగు పెట్టింది. హీరోయిన్ గా మారకముందు టెలివిజన్ వ్యాఖ్యాతగా ‘అసత పోవతు ఎవరు’ అనే కామెడీ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత ‘మానాడ మయిలాడ’ అనే రియాల్టీ షోలో కూడా పాల్గొనింది. 2011లో ‘అవర్గళం వీరిగళం’ అనే చిత్రంలో నటించిన ఈమె.. ఆ తర్వాత ఏడాది ‘అట్ట కత్తి’ లో నటించి, తన నటనతో మంచి పేరు సొంతం చేసుకుంది. ఇక 2014లో వచ్చిన ‘కాకా ముట్టై’ సినిమా కోసం ఏకంగా ఉత్తమ నటిగా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డును సొంతం చేసుకుంది. ఇక తర్వాత పలు చిత్రాలలో నటించిన ఈమెకు నాలుగు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు, రెండు ఫిలిమ్ ఫేర్ అవార్డులతో పాటు తమిళనాడు స్టేట్ ఫిలిం అవార్డు కూడా లభించింది. ఈమె ఎవరో కాదు ప్రముఖ దివంగత నటుడు రాజేష్ కి కూతురు కాగా, ప్రముఖ సీనియర్ నటీమణి శ్రీలక్ష్మికి మేనకోడలు. ఇంకా ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు వరుస షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి వెళ్తూ బిజీగా మారిపోయింది.
https://www.instagram.com/stories/aishwaryarajessh/3609894256914917908?utm_source=ig_story_item_share&igsh=NTZqNmR0ZmNjN2lw