BigTV English

Tips For Cockroaches: బొద్దింకలతో విసిగిపోయారా ? ఇలా చేస్తే.. ఇంటి నుండి పూర్తిగా పారిపోతాయ్

Tips For Cockroaches: బొద్దింకలతో విసిగిపోయారా ? ఇలా చేస్తే.. ఇంటి నుండి పూర్తిగా పారిపోతాయ్

Tips For Cockroaches: ఇంట్లో బొద్దింకలు (Cockroaches) తిరుగుతుంటే.. చాలా చిరాకుగా అనిపిస్తుంది. ఇవి చూడటానికి పురుగులే అయినా జలుబు, అలర్జీ, ఆస్తమా లాంటి ఆరోగ్య సమస్యలకు కూడా కారణమవుతాయి. ముఖ్యంగా బొద్దింకలు వంటగదిలో ఉండటం వల్ల ఆహార పదార్థాలపై చేరి వాటిని కూడా పాడు చేస్తాయి. అంతే కాకుండా వీటి వల్ల పిల్లలు, వృద్ధుల ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితం అవుతుంది.


ఇలాంటి పరిస్థితి ఎదురవకుండా ఉండాలంటే.. బొద్దింకల నుండి పూర్తిగా విముక్తి పొందడానికి సహజమైన, సురక్షితమైన, ప్రభావ వంతమైన చిట్కాలను ట్రై చేయడం మంచిది. వీటిని ఫాలో అవ్వడం వల్ల ఒక్క బొద్దింక కూడా ఇంట్లోకి రాదు. మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. శుభ్రత  ముఖ్యం:
బొద్దింకలు ఎక్కువగా తినేవాటిని వెతుకుతూ వస్తుంటాయి. అందుకే ఇంట్లో శుభ్రత పాటించటం మంచిది. ఎప్పటికప్పుడు క్రింద పడిన ఆహార పదార్థాలు లేదా పాత్రల్లో తినగా ఉన్న మిగిలిన పదార్థాలను డస్ట్ బిన్ లో పడేయాలి.


ప్లేట్లు, పాత్రలు గంటల తరబడి క్లీన్ చేయకుండా వదిలి పెట్టకుండా వెంటనే శుభ్రం చేయాలి.

వంటింటిలో పిండి, చక్కెర వంటి వాటిని గాలి చొరబడని డబ్బాల్లో స్టోర్ చెయ్యాలి.

డస్ట్‌బిన్‌ను ఎప్పటికప్పుడు ఖాళీ చేయండి.

ఇంట్లో నీరు ఎక్కడా స్టోర్ అవ్వకుండా చూసుకోండి. ఎందుకంటే బొద్దింకలు నీటి కోసం కూడా వెతుక్కుంటూ వస్తాయి.

హోం రెమెడీస్:

క్రింది టిప్స్ ఫాలో అవ్వడం వల్ల బొద్దింకలను తక్కువ ఖర్చులో, సురక్షితంగా బయటకు పంపించవచ్చు.

1. బేకింగ్ సోడా + చక్కెర:
బేకింగ్ సోడా, చక్కెరలను సమాన మోతాదుల్లో తీసుకుని వాటిని మిక్స్ చేసుకోవాలి. తర్వాత బొద్దింకలు ఉన్న చోట ఈ మిశ్రమాన్ని చల్లుకోండి. ఇలా చేయడం వల్ల బొద్దింకలు చనిపోతాయి. దోమల సంఖ్య కూడా పెరగకుండా ఉంటుంది.

2. బోరిక్ పౌడర్:
ఇది బలమైన రసాయనాలు కలిగిన పదార్థం. బోరిక్ యాసిడ్‌ను గోధుమ పిండి లేదా చక్కెరతో కలిపి చిన్న గుళికల్లాగా చేసి బొద్దింకలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో పెట్టండి. ఇలా చేయడం వల్ల బొద్దింకలు త్వరగా చనిపోతాయి.

3. లవంగాలు, దాల్చిన చెక్క, తులసి:

ఈ వాసనలను బొద్దింకలు తట్టుకోలేవు. కాబట్టి బొద్దింకలు ఎక్కువగా ఉన్న చోట లేదా తలుపుల దగ్గర లేదా మూలల్లో వీటిని పెట్టడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.

4. నిమ్మరసం + నీరు:

కాస్త నిమ్మరసం తీసుకుని ఒక గ్లాస్ నీటిలో కలపండి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో నింపి బాత్‌రూమ్‌లు, కిచెన్ సింక్‌ తొ పాటు దోమలు ఎక్కువగా ఉన్న చోట్ల స్ప్రే చేయండి. ఇలా చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.

చిల్లులు, తేలికపాటి రంధ్రాలు మూసివేయండి:

బొద్దింకలు ఇంట్లోకి వచ్చే మార్గాలను మూసి వేయడం చాలా ముఖ్యం.

తలుపులు, కిటికీల చుట్టూ ఉండే చిన్న రంధ్రాలను సీలెంట్ లేదా మెష్‌తో మూసేయాలి.

నీటి పైపు కనెక్షన్ల చుట్టూ గ్యాప్ ఉంటే వాటిని కూడా సరిచేయండి.

Also Read: పుచ్చకాయపై ఉప్పు చల్లుకుని తినాలా ? వద్దా ?

మరిన్ని నివారణ మార్గాలు:

బొద్దింకల ఎక్కువగా ఉండే ప్రదేశాలను గుర్తించి వాటిని తొలగించాలి.

ఇంటి చుట్టూ చెత్త పేరుకుపోకుండా చూడండి.

గారేజ్ లేదా వరండాలో పాత బాక్సులు, కార్డ్బోర్డ్లు ఎక్కువ కాలం ఉండకుండా చూసుకోండి.

బొద్దింకల నివారణకు ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచడం, ఆహార పదార్థాలను కప్పి పెట్టడం, హోం రెమెడీస్ ఉపయోగించడం ద్వారా ఈ సమస్యను చాలా వరకు నియంత్రించవచ్చు.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×