BigTV English

Sudheer Babu : మంచు హీరోను మోసం చేసిన సుధీర్ బాబు… వాడుకున్నంత వాడుకుని సారీ చెప్పేస్తే సరిపోతుందా?

Sudheer Babu : మంచు హీరోను మోసం చేసిన సుధీర్ బాబు… వాడుకున్నంత వాడుకుని సారీ చెప్పేస్తే సరిపోతుందా?

Sudheer Babu : టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు తాజాగా మంచు మనోజ్ కు సారీ చెప్పాడు. ఆయన సారీ చెప్పేదాకా సుధీర్ బాబు తనను వాడుకుని మోసం చేశాడన్న విషయం మనోజ్ కి తెలియనే లేదు. అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి.


ఇంత మోసమా?

సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మా నాన్న సూపర్ హీరో’. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ కాగా, సినిమా ఫుల్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ లా ఉండబోతుందనే విషయం ప్రేక్షకులకు అర్థమైంది. తండ్రి, కొడుకుల మధ్య జరిగే సంఘర్షణ నేపథ్యంలో ఈ మూవీ రాబోతున్నట్టు మేకర్స్ హింట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే సినిమాను సుధీర్ బాబు బాగా ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే మనోజ్ కి తెలియకుండానే ఆయనను తన ప్రమోషన్స్ కోసం వాడేసుకున్నారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ సుధీర్ బాబు మంచు మనోజ్ కి సారీ చెప్పాడు.


అసలేం జరిగిందంటే?

మంచు మనోజ్ బయట కనిపించడంతో ఆయనను ఫోటోగ్రాఫర్లు ఆపి ఫోటోలకు ఫోజులు ఇవ్వమన్నారు. ఆ టైంలో తన వెనకాల ఏం జరుగుతుందో చూడకుండా మనోజ్ ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. ఆయన ఫోటోలు దిగుతున్న నిమిషాల వ్యవధిలోనే మంచు మనోజ్ వెనక ఓ బ్యానర్ మీద ‘మా నాన్న సూపర్ హీరో’ అనే పోస్టర్ ను పెట్టారు. అంటే ఆ పోస్టర్ దగ్గర మంచు మనోజ్ ఫోటో దిగి, సినిమాను ప్రమోట్ చేసినట్టుగా అయింది. ఇక మనోజ్ వెనక్కి తిరిగేలోపు దాన్ని రివర్స్ లో తిప్పేసి సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అలా మొత్తానికి తన తెలియకుండానే మంచు మనోజ్ ‘మా నాన్న సూపర్ హీరో’ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు.

ఈ విషయాన్ని సుధీర్ బాబు సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ‘సారి బ్రో నాకు మరో ఆప్షన్ లేదు’ అంటూ మంచు మనోజ్ ని ట్యాగ్ చేశాడు. ఇంకేముంది తనకు తెలియకుండానే ఇంత జరిగిందా అన్నట్టుగా మనోజ్ అవాక్కయ్యాడు. అంతేకాకుండా బ్రహ్మానందం మీమ్ ను పెట్టి తన ఎక్స్ప్రెషను బయట పెట్టాడు. కానీ ఇద్దరు హీరోల మధ్య జరిగిన ఈ ఫన్నీ డిస్కషన్ లో చూసిన నెటిజన్లు కూడా ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

మహేష్ బాబు చేతుల మీదుగా ట్రైలర్

ఇక ఈ నేపథ్యంలోనే సుధీర్ బాబు ‘మా నాన్న హీరో’ మూవీ ట్రైలర్ ను అక్టోబర్ 5న రిలీజ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. అయితే యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ట్రైలర్ ను మహేష్ బాబు లాంచ్ చేయబోతున్నట్టుగా టాక్ నడుస్తోంది. ఇక ‘మా నాన్న సూపర్ హీరో’ మూవీని అక్టోబర్ 11న దసరా కానుకగా రిలీజ్ చేయబోతున్నారు. ‘సమ్మోహనం’ తర్వాత ఈ హీరో ఖాతాలో ఒక్క హిట్ కూడా పడలేదు. మరి ఈ సినిమాతోనైనా సుధీర్ బాబు హిట్ అందుకుంటాడా అనేది చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×