Ambajipeta Marriage Band OTT update(Telugu film news): టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు సుహాస్ ప్రస్తుతం మంచి కంటెంట్‌లను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. కలర్ ఫొటో సినిమాతో హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. దీనికంటే ముందు సినిమాలలో సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ తన నటనతో అందరినీ అలరించాడు.
తనకు ఇచ్చిన ఎలాంటి పాత్రలో అయినా.. ఇట్టే ఒదిగిపోతాడు. ఇక తన అద్భుతమైన టాలెంట్‌తో నెగెటివ్ పాత్రలతో పాటు హీరోగా కూడా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇటీవలే రైటర్ పద్మభూషణ్ సినిమాతో వచ్చి మరో హిట్టును తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎవరూ ఊహించని ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
అయితే ఇప్పుడు ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమాతో వచ్చాడు. జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. నిర్మాత ధీరజ్ మొగిలినేని ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరించారు.
READ MORE: అరరే అపుడే ఓటీటీలోకి సుహాస్ కొత్త సినిమా.. నెల రోజుల్లోపే స్ట్రీమింగ్.. ఎక్కడంటే..?
దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి నుంచి మంచి పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా కలెక్షన్లు కూడా బాగానే రాబట్టింది. రూ.3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్‌లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసుకుని లాభాల పంట పండించినట్లు తెలుస్తోంది.
కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా రూ.8 కోట్లకు పైగా కలెక్షన్లు నమోదు చేసి అందరినీ ఆశ్చర్యపరచింది. ఇక థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ, తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్‌పై ఓటీటీ సంస్థ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేసింది.
అంబాజీపేట మ్యారేజిబ్యాండు మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ సంస్థ ఆహా భారీ ధరకు కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో ఆహా తాజాగా ఓ పోస్టర్‌ను పంచుకుంటూ.. ‘మల్లిగాడు మాయా ప్రపంచంలోకి అడుగుపెట్టండి’ అంటూ త్వరలోనే ఈ మూవీని ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపింది.
READ MORE: ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ లేటెస్ట్ కలెక్షన్స్.. సుహాస్ ఖాతాలో మరో హిట్టు
అయితే స్ట్రీమింగ్ డేట్ మాత్రం ఇంకా వెల్లడించలేదు. తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీ మార్చి 1 నుంచి స్ట్రీమింగ్‌కు రానున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీలో సుహాస్‌కు జోడీగా శివాని నాగరం హీరోయిన్‌గా నటించి అందరినీ ఆకట్టుకుంది.