Most Popular Leader in the World is PM Modi(Political news telugu): నరేంద్ర మోదీ.. పదేళ్లుగా ప్రధాని పీఠంపై కూర్చుని.. దేశాన్ని ప్రగతి గతివైపు నడిపిస్తున్న వ్యక్తి. తాజాగా ప్రధాని మోదీకి అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ప్రధాని మోదీ మరో ఘనత సాధించారు. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నిర్వహించిన అధ్యయనంలో నరేంద్రమోదీ టాప్ లో నిలిచారు. బైడెన్, ట్రూడో, సునాక్ లను వెనక్కి నెట్టి.. ప్రధాని నరేంద్రమోదీ అగ్రస్థానంలో నిలిచారు.
ఈ ఏడాది జనవరి 20వ తేదీ నుంచి ఫిబ్రవరి 5 వరకూ మార్నింగ్ కన్సల్ట్ వెబ్ సైట్ ఈ సర్వేను నిర్వహించింది. వివిధ దేశాలకు చెందిన అధినేతలకు వారివారి దేశాల్లో ప్రజాదరణ ఏ స్థాయిలో ఉందో సర్వేలో లెక్కించగా.. ప్రధాని మోదీకి మనదేశంలో 78 శాతం ప్రజలు అనుకూలంగా ఓటేశారు. దీంతో ఆయన మోస్ట్ పాపులర్ గ్లోబల్ లీడర్ గా తొలిస్థానాన్ని దక్కించుకున్నారు.
Read More : యూనిఫాం సివిల్ కోడ్ దిశగా అస్సాం.. ముస్లిం వివాహాలు, విడాకుల చట్టాన్ని రద్దు చేసిన ప్రభుత్వం..
కాగా.. గతేడాది డిసెంబర్ లో ఇదే వెబ్ సైట్ నిర్వహించిన సర్వేలో 76 శాతం ప్రజాదరణ లభించింది. నెలరోజుల్లో ప్రధానికి మరో 2 శాతం ప్రజాదరణ పెరగడం విశేషం. త్వరలోనే జరగనున్న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ మోదీ హవా కొనసాగితే.. ఆయన చెప్పే విశ్వగురూ కల సాకారం అవుతుందని కాషాయ వర్గాలు నమ్ముతున్నాయి.