Sukumar : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో సుకుమార్ ఒకరు. ఆర్య సమాజం తెలుగు సినిమా ఇండస్ట్రీ కు ఎంట్రీ ఇచ్చిన సుకుమార్ తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశాడు. ఇప్పుడు సుకుమార్ అంటే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. రచయిత తన కెరీర్ మొదలుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన పంథాను ఏర్పరచుకొని సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. సుక్కు దర్శకత్వం వహించిన ఆర్య సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ప్రేమ కథను ఇలా కూడా చెప్పచ్చు అని సుకుమార్ ప్రూవ్ చేసి సక్సెస్ కొట్టాడు. ఇకపోతే సుకుమార్ దగ్గర పని చేసిన చాలా మంది దర్శకులుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన పేరును సాధించుకుంటున్నారు. కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ లానే ఉండిపోతారు. కానీ సుకుమార్ దగ్గర పని చేసిన వాళ్ళు మాత్రం డైరెక్టర్ గా కూడా గుర్తింపు పొందుతారు.
ఇకపోతే ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది కోరుకున్నది ఒక గుర్తింపు. పేరు గుర్తింపు కోరుకునే వారు ఉండరు అనడం అతిశయోక్తి కాదు. జులాయి సినిమాలో కోట శ్రీనివాసరావు చెప్పినట్లు “కారు అనగానే స్టీరింగ్ టైర్లు మాత్రమే కాదు పెట్రోల్ కూడా.. అది మన కంటికి కనిపించదు అది లేకపోతే బండి నడవదు”అలానే అసిస్టెంట్ డైరెక్టర్ లేకపోతే సినిమా అనేది జరగదు అని కూడా చెప్పాలి. అసిస్టెంట్ డైరెక్టర్స్ కి సరైన గుర్తింపు రాకపోవచ్చు. కేవలం ఒక రెండు సెకన్స్ స్క్రీన్ మీద పేరు ఇలా వచ్చే అలా వెళ్ళిపోతుంది. ఇకపోతే అసిస్టెంట్ డైరెక్టర్ల కష్టాన్ని గుర్తించే దర్శకుడు అంటే టక్కున గుర్తొచ్చే పేరు సుకుమార్. తన ప్రతి సినిమాకి పేరుపేరునా ప్రతి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తన సినిమాకి ఎంతవరకు సహాయపడ్డారు అని చెబుతూ వస్తుంటాడు సుకుమార్.
ఇక పుష్ప 2 సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేస్తుంది. ఈ సినిమాకి సంబంధించి కూడా తన అసిస్టెంట్ డైరెక్టర్ టీమ్ అందరినీ స్టేజ్ పైకి పిలిచి సక్సెస్ మీట్ లో మాట్లాడాడు సుకుమార్. సుకుమార్ అంటే కేవలం నేనొక్కడినే కాదు మేమంతా కలిపి సుకుమార్. వీళ్ళు ఏ ఒక్కరు లేకపోయినా ఈ సినిమా ఇంత అందంగా వచ్చేది కాదు. నేను స్టోరీని కొంతమందితో డిస్కషన్ చేస్తూ ఉంటా, మరి కొంతమంది నాకు సెట్లో సహాయపడుతూ ఉంటారు. ఇందులో నా అభిమానులు కూడా ఉన్నారు. నన్ను దగ్గర నుంచి చూస్తే అభిమానించడం మానేస్తారు అని చెప్పి దాదాపు రెండు మూడేళ్లు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా నేను వీళ్లను పెట్టుకోలేదు. అంటూ టీ మొత్తం గురించి వాళ్ళ కష్టం గురించి నవ్వుతూ మాట్లాడాడు సుకుమార్. ఇక ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు క్రెడిట్ విషయంలో అసిస్టెంట్ డైరెక్టర్స్ కి ఇవ్వాల్సిన క్రెడిట్ ఇవ్వాలి. సుకుమార్ నుంచి ఇది నేర్చుకోవాలి అనేది కొంతమంది అభిప్రాయం.
Also Read : Allu Arjun: మెగాస్టార్ ని మర్చిపోవడమే కాదు, ఇప్పుడు తెలంగాణ సీఎం పేరు మర్చిపోయిన అల్లు అర్జున్