Sukumar – Devi Nagavalli : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్ లో సుకుమార్ ఒకరు. సుకుమార్ దగ్గర శిష్యరికం చేయాలని చాలామంది ఆశపడుతూ ఉంటారు. సుకుమార్ దగ్గర చేసిన చాలామంది నేడు దర్శకులుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. సుకుమార్ దగ్గర పని చేసిన బుచ్చిబాబు సాన ఉప్పెన సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. మొదటి సినిమాతోనే బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టాడు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ హీరోగా సినిమాను చేస్తున్నాడు బుచ్చిబాబు. ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది అని చాలామంది సినిమా ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. అలానే బుచ్చిబాబు కూడా పలు సందర్భాల్లో ఈ సినిమా రా అండ్ రస్టిక్ గా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు.
నాని హీరోగా దసరా అనే సినిమాను చేశాడు శ్రీకాంత్ ఓదెల. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాని కెరియర్లో హైయెస్ట్ కలెక్షన్ వసూలు చేసిన సినిమా దసరా. ఇకపోతే ప్రస్తుతం శ్రీకాంత్ మళ్ళీ నానితో ప్యారడైజ్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమాను చేయనున్నాడు శ్రీకాంత్. ఒక ప్రస్తుతం సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దర్శకులుగా నిరూపించుకోవచ్చు అని చాలామందికి ఒక స్థాయి నమ్మకం వచ్చింది. బహుశా అదే టార్గెట్ తో ప్రముఖ జర్నలిస్ట్ దేవి నాగవల్లి కూడా సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తుంది. పుష్ప టు సినిమాకి దేవీ నాగవల్లి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసింది. ఇక ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్.
ఈ సక్సెస్ మీట్ లో సుకుమార్ తన డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరిని పరిచయం చేశారు. ఒక ముఖ్యంగా దేవి నాగవల్లి గురించి మాట్లాడుతూ దేవీ నాగవల్లికి విపరీతమైన టాలెంట్ ఉంది. ఆమెకి చాలా స్టోరీస్ పైన మంచి అవగాహన ఉంది. ఫ్యూచర్లో అన్ని బాగుంటే దేవీ నాగవల్లి కథను నేను దర్శకత్వం చేసే అవకాశం కూడా ఉంది అని సుకుమార్ ఆన్ స్టేజ్ చెప్పుకొచ్చారు. ప్రముఖ ఛానల్లో జర్నలిస్ట్ గా పని చేసింది కాబట్టి చాలా అంశాల పైన మంచి క్లారిటీ ఉంటుంది. ఆ క్లారిటీ తోనే ఫిలిం మేకింగ్ లో కూడా తన టాలెంట్ ప్రూవ్ చేసుకొని ప్రయత్నాలు చేసింది దేవి. ఎట్టకేలకు సహాయ దర్శకురాలుగా ప్రయాణం మొదలుపెట్టింది. ఏదో ఒక రోజు దర్శకురాలుగా కూడా తను పేరు తెచ్చుకుంటుంది అని చెప్పొచ్చు. ఏదేమైనా దేవీ నాగవల్లి కథతో సుకుమార్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో అని క్యూరియాసిటీ చాలామందికి మొదలైంది.
Also Read : Sukumar : సుకుమార్ ను చూసి మిగతా దర్శకులు నేర్చుకోవాలి