BigTV English
Advertisement

Sukumar: తమిళ్లో భారీ బడ్జెట్ సినిమా తీయాలి అంటే ఈ హీరోలతో పని చేయాలి

Sukumar: తమిళ్లో భారీ బడ్జెట్ సినిమా తీయాలి అంటే ఈ హీరోలతో పని చేయాలి

Sukumar: ఇప్పుడు తెలుగు సినిమా మార్కెట్ కంప్లీట్ గా మారిపోయింది. మినిమం మూడు నాలుగు కోట్లు లేకుంటే సినిమా చేయలేని పరిస్థితికి వచ్చేసింది అంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు సినిమాలు నిర్మాణం లక్షల్లో జరిగేది. కానీ ఇప్పుడు కోట్లలో జరుగుతుంది. ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో 100 కోట్లు సినిమా ఉండటం అనేది గగనం. కానీ ఇప్పుడు టార్గెట్ అంతా వెయ్యి కోట్లు సినిమా అయిపోయింది. ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమా మార్కెట్ కంప్లీట్ గా మారిపోయింది. త్రిపుల్ ఆర్ సినిమాతో అది నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రతి దర్శకుడు కూడా 1000 కోట్లు సినిమా చేయాలి అనే టార్గెట్ ను పెట్టుకొని పనిచేస్తున్నారు. రీసెంట్ గా కల్కి సినిమా కూడా 1000కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. అలానే సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమా కూడా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది.


తమిళ్లో భారీ బడ్జెట్

ఇక సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పుష్ప రాజ్ అనే ఒక పాత్రతో ప్రపంచవ్యాప్తంగా షేక్ చేశాడు సుకుమార్. చాలామంది పుష్పరాజ్ పాత్రను ఇమిటేట్ చేయడం మొదలుపెట్టారు. ఈ సినిమా కలెక్షన్స్ కూడా అద్భుతంగా వచ్చాయి. ఆ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన పుష్ప 2 సినిమా కూడా ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ ను తెచ్చిపెట్టింది. ఇక ఈ విషయమై ఒక తమిళ ఈవెంట్లో సుకుమార్ ఒక ప్రశ్న ఎదురైంది. పుష్ప సినిమా ఫ్రాంచైజ్ లాగా ఇక్కడ ఒక భారీ బడ్జెట్ సినిమా చేస్తే, ఎవరిని హీరోగా ఎన్నుకుంటారు అంటూ అడిగారు. దానికి సమాధానంగా సుకుమార్ మాట్లాడుతూ నేను విజయ్ గారి సినిమాలు చాలా తక్కువ చూశాను, అజిత్ గారి సినిమాలు కూడా చాలా తక్కువ చూశాను, కానీ ఐ లవ్ కార్తీ అంటూ కార్తి ఎక్స్ప్రెషన్స్ గురించి మాట్లాడారు. ఒకవేళ తమిళ్లో సుకుమార్ సినిమాను చేయాల్సి వస్తే వీళ్ళ ముగ్గురితో చేస్తారు అని చెప్పొచ్చు.


తెలుగులో మార్కెట్

ఇకపోతే సుకుమార్ ప్రస్తావించిన ఈ ముగ్గురు హీరోలకి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. అంతేకాకుండా ముగ్గురు హీరోలు ఇదివరకే తెలుగులో కూడా సినిమాలు చేశారు. ముఖ్యంగా కార్తీకి తెలుగు ప్రేక్షకులు అంటే ఎంత ఇష్టమో పలు సందర్భాల్లో ఓపెన్ గా చెబుతూ వచ్చాడు. విజయ్ తెలుగు ప్రమోషన్స్ కి రాకపోయినా కూడా విజయ్ సినిమాలను ఇష్టపడే అభిమానులు చాలామంది ఉన్నారు. అజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు భాషతో సంబంధం ఉండేది. కానీ ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా అన్ని రకాల సినిమాలు ప్రేక్షకులు చూస్తున్నారు. కాబట్టి మిగతా ఇండస్ట్రీలో హీరోలుకు కూడా మంచి మార్కెట్ తెలుగులో వచ్చింది.

Also Read : Harish Shankar: రామ్ చరణ్ తో అలాంటి సినిమా చేయాలి

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×