Aghori Latest Update: గత కొన్నేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో, సోషల్ మీడియాతో పాటు మీడియాల్లోనూ మారు మోగుతూ ఉంది. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో అఘెరీ వార్తలో నిలుస్తూ ఉంది. కొద్ది రోజుల క్రితం వర్షిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం ఈ జంట ఉత్తర ప్రదేశ్‌లో ఉంది. కొత్తగా పెళ్లయిన ఈ జంటకు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు.
విమర్శలు, వివాదాలు, అనంతరం ఎట్టకేలకు అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఉత్తర ప్రదేశ్ పారిపోయిన అఘోరీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాంత్రిక పూజల పేరుతో మహిళ నుంచి 10 లక్షలు వసూళ్లు చేసి మోసానికి పాల్పడిన కేసులో అఘోరీని అరెస్ట్ చేశారు. పూజల పేరుతో డబ్బులు తీసుకుని మోసగించంతో.. ఆ డబ్బు తిరిగి ఇవ్వమని అడగ్గా అఘోరీ అలియాస్ శ్రీనివాస్ చంపుతానంటూ బెదిరింపులకు దిగారని సదరు మహిళ మొకిలా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
యూపీలో అదుపులోకి తీసుకుని.. తెల్లవారుజామున నార్సింగి పీఎస్‌కు తరలించారు. అఘోరీతో పాటు ఇటీవల తనను వివహాం చేసుకున్న వర్షిణీని కూడా నగరానికి తరలించినట్లు తెలుస్తోంది. రంగా రెడ్డి జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఓ మహిళ లేడీ అఘోరీ మోసాలను ఇటీవల బయటపెట్టింది. లేడీ అఘోరీతో ఆరు నెలల క్రితం పరిచయమైనట్లు తెలిపింది. పరిచయమైన రెండు నెలల తర్వాత ప్రొద్దుటూరులోని ప్రగతి రిసార్ట్‌కు డిన్నర్‌కు వచ్చిందని వెల్లడించింది. అప్పటి నుంచి తరచూ ఫోన్లు చేస్తూ వ్యక్తిగత విషయాలను తెలుసుకునేదని ఒక పూజ చేస్తే అంతా మంచే జరుగుతుందని మాయమాటలు చెప్పి నమ్మించిందని సదరూ మహిళ వెల్లడించింది.
లేడీ అఘోరీ మాటలు నమ్మి పూజకు అంగీకరించానని చెప్పంది. వారం రోజుల్లో పూజ చేద్దామని చెప్పడంతో నమ్మి.. ఖర్చుల కోసం ఐదు లక్షలు లేడీ అఘోరీ అకౌంట్లో వేశానని బాధిత మహిళ వాపోయింది. ఆ తర్వాత పూజ కోసం యూపీలోని ఉజ్జయిని ఫామ్ హౌస్ లోకి తీసుకెళ్లి పూజలు చేసిందని తెలిపింది. మరుసటి రోజు మరో ఐదు లక్షలు వేయాలని.. లేక పోతే పూజ విఫలమై పూజ నాశనం అవుతుందని లేడీ అఘోరీ బటపెట్టిందని చెప్పింది. ఈ తరుణంలో అఘోరీనీ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తెల్లవారుజామున నార్సింగి పీఎస్‌కు తరలించారు. అఘోరి శ్రీనివాస్ ని వైద్య పరీక్షల నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. ఇక ఇటీవల అఘోరీ-శ్రీ వర్షిణి ఉదంతంలో అనూహ్యమైన ట్విస్ట్ చోటు చేసుకుంది. తాను అఘోరి మొదటి భార్యనంటూ.. తనను మోసం చేశాడని రాధిక అనే మహిళ మోకిలా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
Also Read: వైరుకు వేలాడిన తాగుబోతు.. గాల్లో ప్రాణాలు.. పైనుంచి పడేసరికి..
అరెస్టుపై అఘోరీ స్పందన..
అరెస్టుపై అఘోరీ స్పందించింది. చట్టం తన పని తాను చేసుకుంటుందని.. తాను పోలీసులకు, కోర్టుకు సహకరిస్తున్నాని తెలిపింది.