Sumkumar on Shresti Varma..పుష్ప-1, పుష్ప -2 సినిమాలతో సుకుమార్ (Sukumar) కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతున్నాయి. ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి (Rajamouli) తో పాటు సమాన స్థాయిలో ఉన్న డైరెక్టర్ల లిస్ట్ లో సుకుమార్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. అలా తనదైన శైలిలో సినిమాలకు దర్శకత్వం వహిస్తూ.. పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సుకుమార్ తాజాగా యాక్షన్ హీరో అర్జున్(Arjun ) స్వీయ నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘సీతా పయనం’ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొని లేడీ కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ (Shresti varma) గురించి సీక్రెట్ విషయాలను బయట పెట్టారు. ఆ రోజు నేను చెప్పలేదు.కానీ ఈరోజు కచ్చితంగా చెబుతాను అంటూ శ్రేష్టి వర్మ గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టారు. మరి ఇంతకీ శ్రేష్టి వర్మ గురించి సుకుమార్ చెప్పిన ఆ సీక్రెట్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..
క్యాస్టింగ్ కౌచ్ వివాదంలో ఇరుక్కున్న శ్రేష్టి వర్మ..
గత కొద్ది రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది మహిళలు బయటికి వచ్చి క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇందులో భాగంగా లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అయినటువంటి శ్రేష్టి వర్మ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master)పై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలో జానీ మాస్టర్ జైలు జీవితం కూడా గడిపారు. ప్రస్తుతం బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇక ఈ విషయం వెలుగులోకి వచ్చిన సమయంలో ఎన్నో వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా శ్రేష్టి వర్మకు సపోర్ట్ ఇచ్చేది అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ లే అని, వీరి సపోర్ట్ చూసుకునే శ్రేష్టి వర్మ మా అసోసియేషన్ లో ఫిర్యాదు చేసింది అని ఒక ఆరోపణ కూడా బయటకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. జానీ మాస్టర్ అరెస్టు వెనుక అల్లు అర్జున్ హస్తం ఉందంటూ అప్పట్లో మెగా ఫ్యాన్స్ కూడా ఈ విషయాన్ని తెగ వైరల్ చేశారు.
పూర్తి క్రెడిట్ శ్రేష్టి వర్మ కే – సుకుమార్
ఇదంతా పక్కన పెడితే.. తాజాగా సీత పయనం టీజర్ లాంచ్ ఈవెంట్లో సుకుమార్ మాట్లాడుతూ.. పుష్ప-2 సినిమాలో “సూసేకి అగ్గి రవ్వ మాదిరి” అనే పాట పూర్తి కొరియోగ్రఫీని శ్రేష్టి వర్మనే చేసింది. అయితే ఆనాడు గణేష్ ఆచార్య మాస్టర్ చేసినట్టు చెప్పుకు వచ్చాము. కానీ ఇందులో 80% శ్రేష్టి వర్మనే పూర్తి చేసింది.అలాగే ఈ సినిమాలోని కొన్ని మాంటైజ్ షార్ట్స్ కూడా శ్రేష్టి వర్మానే కంపోజ్ చేసింది.అయితే సూసేకి పాట కొరియోగ్రఫీని గణేష్ ఆచార్య చేసినట్టు అప్పుడు చెప్పాం. కానీ అప్పుడు శ్రేష్టి వర్మ చేసిందని చెప్పలేకపోయాం.. కానీ ఇప్పుడు అందరికీ వినిపించేలా చెబుతున్నాను. ఈ పాట క్రెడిట్ మొత్తం శ్రేష్టి వర్మదే అంటూ సుకుమార్ చెప్పుకొచ్చారు. అయితే ఇదే ఈవెంట్ లో శ్రేష్టి వర్మ కూడా పాల్గొన్నారు. దాంతో అప్పుడు చెప్పలేని విషయాన్ని ఇప్పుడు బయటపెట్టారు సుకుమార్. ఇకపోతే ఈ విషయం తెలిసి నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆరోజు ఎందుకు ఆచార్య గణేష్ పేరు బయట పెట్టారు. ఇప్పుడెందుకు ఈమె పేరు చెబుతున్నారు అసలేం జరుగుతోంది అంటూ సుకుమార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. మరి దీనికి సమాధానం సుకుమార్ ఏ విధంగా తెలియజేస్తారో చూడాలి.
.
also read ; Mass Jathara: మాస్ జాతర రిలీజ్ డేట్ లాక్.. గణేష్ ఉత్సవాలు థియేటర్లో..!