Elon Musk: వరల్డ్ రిచెస్ట్ పర్సన్, టెస్లా సీీఈవో, అమెరికా ప్రభుత్వం డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ శాఖ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పాలకవర్గం నుంచి తప్పుకుంటున్నట్టు సంచలన ప్రకటన చేశారు. సోషల్ మీడియా ఎక్స్ లో ఆయన పోస్ట్ చేశారు.
ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా తన షెడ్యూల్ కంప్లీట్ అయిందని చెప్పారు. ప్రభుత్వంలో వృథా ఖర్చులను తగ్గించే అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రెసిడెంట్ ట్రంప్ కు ధన్యవాదాలు తెలియజేశారు. డోజ్ మిషన్ ఫ్యూచర్ లో మరింత బలోపేతం అవుతోందని ఆయన తెలిపారు. అయితే, ఇటీవల అమెరికా ప్రభుత్వం రూపొందించిన బిల్లుపై ఎలాన్ మస్క్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ బిల్లుకు బడ్జెట్ ఎక్కువగా కేటాయించాల్సి రావడంతో.. గవర్నమెంట్ ఖర్చులు తగ్గించాలనే డోజ్ ఆశయాలకు విరుద్ధంగా ఉందని ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఎలాన్ మస్క్ తెలిపారు. ఇప్పటి వరకు డోజ్ తీసుకున్న చర్యలు ఈ నిర్ణయంతో వృథా అవుతాయని తెలిపారు. అమెరికా ప్రభుత్వం రూపొందించిన ఈ బిల్లులో పన్ను కోతలు, ఇమ్మిగ్రేషన్ అమలు వంటి పలు అంశాలు ఉన్నాయి.
ALSO READ: BJP State President: బీజేపీ అధ్యక్షుడి ఎంపికకు ఎందుకింత ఆలస్యం..
ఇటీవల కొన్ని రోజుల నుంచి ప్రభుత్వ సలహాదారుడి ఉన్నటువంటి ఎలాన్ మస్క్ త్వరలోనే ఆ బాధ్యతల నుంచి వైదొలిగినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. అవన్నీ ఫేక్ న్యూస్ అని ఎలాన్ మస్క్ గతంలో కొట్టిపడేసిన విషయం కూడా తెలిసిందే. అమెరికా ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) ను ఏర్పాటు చేశారు. ఈ డోజ్ విభాగానికి ఎలాన్ మస్క్ ను సారథిగా నియమించారు.
ప్రభుత్వ వ్యవస్థలో సమూలమైన మార్పులు, శాఖల్లో వృథా ఖర్చుల తగ్గించడమే లక్ష్యంగా గత కొన్ని రోజుల నుంచి ఈ డోజ్ విభాగం పని చేస్తుంది. ఆ తర్వాత పలు శాఖల్లో వేలాది మంది ఉద్యోగులను తొలగించే ప్రక్రియను చేపట్టారు. ఉద్యోగులను తొలగించే క్రమంలో.. ఎలాన్ మస్క్ తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. డొనాల్డ్ ట్రంప్ యంత్రాగాన్ని ఎలాన్ మస్క్ వెనకుండి నడిపిస్తున్నారనే.. ఆరోపణలు ఎక్కువగా వచ్చాయి. ఈ క్రమంలోనే.. శ్వేతసౌధం స్పందించింది. ట్రంప్ సలహాదారుడిగా మాత్రమే ఎలాన్ మస్క్ ఆ బాధ్యతలు చూస్తున్నారని పేర్కొంది.