RCB Fan: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో లక్నో బౌలర్ దిగ్వేష్ సింగ్ హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ప్రతి మ్యాచ్ లో కూడా… లక్నో బౌలర్ దిగ్వేష్ సింగ్ నోటుబుక్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటాడు. వికెట్ పడిందంటే చాలు… వెంటనే అవుట్ అయిన బ్యాటర్ను గెలికి మరి… దిగ్వేష్ సింగ్ నోట్ బుక్ సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటాడు. మొదట్లో చేతులపైన రాసేవాడు. ఆ తర్వాత ఫైన్ పడడంతో భూమిపైన రాయడం మొదలుపెట్టాడు. ఇలా ఎక్కడపడితే అక్కడ నోట్ బుక్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ రచ్చ చేస్తూ ఉంటాడు.
దిగ్వేష్ ను ట్రోల్ చేస్తున్న బెంగళూరు ( rcb ) ఫ్యాన్స్
లక్నో బౌలర్ దిగ్వేశ్ సింగ్ ను దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో మధ్య ఇటీవల మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ సందర్భంగా… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ జితేష్ శర్మను ఔట్ చేసేందుకు చాలా కష్టపడ్డాడు దిగ్వేశ్ సింగ్. మన్కడింగ్ చేసి కూడా అవుట్ చేసే ప్రయత్నం చేశాడు దిగ్వేష్ సింగ్. అయితే అంపైర్ మాత్రం నాట్ అవుట్ గా ప్రకటించాడు. దీంతో రాయల్ చాలెంజెస్ బెంగళూరు జట్టు గ్రాండ్ విక్టరీ కొట్టింది. అప్పటి నుంచి దిగ్వేష్ సింగ్ ( dIGVESH SINGH Rathi) ఎక్కడ కనిపించినా కూడా… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అభిమానులు రెచ్చిపోతున్నారు.
విమానాశ్రయంలో దిగ్వేశ్ సింగ్ కు అవమానం
దిగ్భేష్ సింగ్ కు ఘోర అవమానం జరిగింది. తాజాగా ఎయిర్పోర్ట్ లో లక్నో ప్లేయర్లు… కనిపించిన నేపథ్యంలో… దిగ్వేష్ సింగ్ కూడా… మెరిశాడు. ఈ నేపథ్యంలోనే అక్కడే ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సంబంధించిన అభిమాని రెచ్చిపోయాడు. అతన్ని చూసి ట్రోలింగ్ చేశాడు. దిగ్వేశ్ సింగ్ ను పిలిచి మరి నోట్ బుక్ సెలబ్రేషన్స్ ఇప్పుడు చేసుకో అంటూ… చురకలు అంటించాడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమాని. దీంతో చేసేదేమీ లేక సరే చేసుకుంటాను లే అని దిగ్వేష్ సింగ్ ఆన్సర్ ఇచ్చాడు.
నేడే క్వాలిఫైయర్ 1 మ్యాచ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ తుది దశకు వచ్చింది. లక్నో సూపర్ జెంట్స్ జట్టుపై విజయం సాధించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు… నేరుగా రెండవ స్థానానికి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ క్వాలిఫైయర్ వన్ మ్యాచ్ ఆడబోతోంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్. ఈ మ్యాచ్ మూలాంపూర్…. వేదికగా జరగబోతోంది. ఇవాళ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ కు వర్షం అడ్డంకి గా మారబోతుందని ముందుగా ప్రచారం జరిగింది. కానీ కాసేపటి క్రితమే వాతావరణ రిపోర్ట్ కూడా వచ్చింది. ఈ రిపోర్ట్ ప్రకారం ఇవాళ చండీఘర్ లో ఎలాంటి వర్షపాతం నమోదు కాదని తేలిపోయింది. దీంతో వర్షం లేకుండానే ఈ క్వాలిఫైయర్ మొదటి మ్యాచ్ జరగనుంది.
?igsh=MXNrandvMWFqeHNqcg%3D%3D