Bayya Sunny Yadav: ప్రముఖ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్(Bayya Sunny Yadav) ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తలలో నిలిచిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఈయన ఎన్నో బెట్టింగ్ యాప్స్(Betting App) ప్రమోట్ చేస్తూ వచ్చారు. ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ఎంతోమంది వీటి మాయలో పడి జీవితాలనే కోల్పోయారు. అందుకే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతూ వచ్చింది. ఇలా ఏ యూట్యూబర్ అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో వారి వివరాలన్నింటినీ మరొక యూట్యూబర్ అన్వేష్ (Anvesh)వరుసగా విడుదల చేస్తూ వచ్చారు. ఇక అన్వేష్ కేవలం యూట్యూబర్స్ మాత్రమే కాకుండా సెలబ్రిటీలు ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో వారందరి వివరాలను కూడా బయటపెట్టారు.
పాకిస్తాన్ టూర్…
ఇలా బయ్యా సన్నీ యాదవ్ ఏకంగా ఒక 20 వరకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని అన్వేష్ వీడియో విడుదల చేశారు. ఈ యాప్స్ ద్వారా భారీగా డబ్బులు సంపాదించారని, ఈ డబ్బుతో ఆరంతస్తుల బిల్డింగ్, కోట్ల విలువచేసే కార్లు, స్పోర్ట్స్ బైక్స్ కొనుగోలు చేశారని తెలిపారు. అయితే తాజాగా బయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ టూర్ (Pakistan Tour)వెళ్లి అక్కడ విశేషాలను కూడా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరితో పంచుకున్నారు. అయితే ఈయన పాకిస్తాన్ టూర్ ముగించుకుని తిరిగి ఇండియా వస్తున్న నేపథ్యంలో NIA అధికారులు తనని చెన్నై ఎయిర్ పోర్ట్ లో కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇలా NIA అధికారులు ప్రస్తుతం తనని విచారణ చేస్తున్నారని తెలుస్తుంది. అయితే సన్నీ యాదవ్ ను NIA అధికారులు కష్టడీలోకి తీసుకోవడంపై అన్వేష్ స్పందించారు. ఈ సందర్భంగా అన్వేష్ మరో సంచలనమైన వీడియోను విడుదల చేశారు.
స్పై ఏజెంట్…
ఈ సందర్భంగా అన్వేష్ మాట్లాడుతూ… బయ్యా సన్నీ యాదవ్ కు యూట్యూబ్ ఛానల్ ద్వారా పెద్ద ఆదాయం లేదని తెలిపారు. ఆయనకు పెద్దగా వ్యూస్ కూడా రావు. ఒక వీడియో కూడా వైరల్ అవ్వలేదు, కానీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల పెద్ద ఎత్తున డబ్బులు తీసుకుంటూ ఖరీదైన కార్లు బైకులు ఆరంతస్తుల భవనం కడుతున్నారు. నేను బెట్టింగ్ యాప్స్ గురించి బయట పెట్టడంతో తను ఆదాయం మొత్తం ఆగిపోయిందని తెలిపారు. ఇలా నేను బెట్టింగ్ యాప్స్ గురించి బయట పెట్టడంతో ప్రతిరోజు నన్ను తిడుతూ వీడియోలు కూడా చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం సన్నీ యాదవ్ NIA అధికారుల కస్టడీలో ఉన్నారు. తనని అధికారులు అదుపులో తీసుకోవడానికి కారణం తను పాకిస్తాన్ టూర్ అంటూ పెట్టిన వీడియోలేనని తెలుస్తుంది. పాకిస్తాన్ ఇండియా మధ్య ఆపరేషన్ సింధూర్ యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే.
పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గాం పై దాడి చేయడంతోనే ఆపరేషన్ సింధూర్ కూడా జరిగింది. అయితే ఈ దాడి జరగడానికి కొంతమంది స్పై ఏజెంట్స్(spy Agents) గా పని చేశారని NIA సందేహాలు వ్యక్తం చేస్తుంది. అందుకే పాకిస్తాన్ వెళ్లి వచ్చిన వారందరిని విచారణ చేస్తున్నారు. ఇందులో భాగంగానే సన్నీ యాదవ్ కూడా పాకిస్తాన్ టూర్ కి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేయడంతో ఈయన కూడా స్పై ఏజెంట్ గా పనిచేశారేమో అన్న అనుమానాలతోనే అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం తనని విచారిస్తున్నారని, అయితే తాను క్షేమంగా బయటకు రావాలని కోరుకుంటున్నాను అంటూ అన్వేష్ చేసిన కామెంట్స్ సంచలనగా మారాయి.