Shikhar Dhawan: టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ప్రస్తుతం కష్టాల్లో ఉన్నాడు. ఒంటరి జీవితం అనుభవిస్తున్న శిఖర్ ధావన్… తన వెంట ఎవరూ లేరని ఆవేదన వ్యక్తం చేశాడు. ముఖ్యంగా తన కొడుకు… తనతో లేకపోవడం.. తనను కలచి వేస్తోందని పేర్కొన్నాడు శిఖర్ ధావన్ ( Shikhar Dhawan). ఎన్ని డబ్బులు సంపాదించిన నా కొడుకుతో మాట్లాడలేకపోతున్నా అంటూ ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం శిఖర్ ధావన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన సతీమణి ఆయేషా ముఖర్జీకి ( Aesha Mukherjee ) విడాకులు ఇచ్చి.. సపరేట్ గా ఉంటున్నాడు శిఖర్ ధావన్. ఇప్పటికే ఈ జంటకు ఒక కొడుకు ఉన్నాడు. అయితే విడాకులు ఇచ్చిన తర్వాత… ఇండియాను వదిలేసి.. ఆస్ట్రేలియాకు వెళ్ళిపోయింది ఆయేషా ముఖర్జీ.
Also Read: ICC Champions Trophy: 8 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ..ఇంత గ్యాప్ రావాడానికి కారణాలు ఇవే ?
వెళ్తూ వెళ్తూ కోర్టు ఆదేశాల మేరకు తన కొడుకును కూడా తీసుకువెళ్లింది. దీంతో అప్పటి నుంచి టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత… మరింత లోన్లీ గా ఫీల్ అవుతున్నాడు శిఖర్ ధావన్. ఈ నేపథ్యంలోనే తన కుమారుడిని గుర్తు చేసుకున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్. తన కొడుకు తో మాట్లాడి దాదాపు ఏడాది కాలం అయిపోయిందని ఆందోళన వ్యక్తం చేశాడు. తన కొడుకును చూడక రెండు సంవత్సరాలు అయిందని వెల్లడించాడు. వెంటనే నా కొడుకు జోరావర్ ను ( Zoraver ) చూడాలని ఉందంటూ ఎమోషనల్ అయ్యాడు టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్. దీంతో శిఖర్ ధావన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తన కొడుకు జోరావర్ ను ఎంతో మిస్ అవుతున్నట్లు పేర్కొన్నాడు. అతనికి తండ్రి ప్రేమను పంచాలని ఉందని కన్నీళ్లు పెట్టుకునే అంత పనిచేశాడు. నా కొడుకు తో మాట్లాడకుండా నన్ను బ్లాక్ చేశారు… ఇప్పుడు భరించలేకపోతున్నా అంటూ చెప్పుకొచ్చాడు శిఖర్ ధావన్. ప్రస్తుతం శిఖర్ ధావన్ కొడుకు జోరావర్ ఆస్ట్రేలియాలో తన తల్లితో ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే… తన కొడుకుతో శిఖర్ ధావన్ ను దూరం చేసింది… ఆయన భార్య ఆయేషా ముఖర్జీ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా పెడుతున్నారు. శిఖర్ ధావన్ ఎమోషనల్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో… ఆయనకు అండగా నిలుస్తున్నారు అభిమానులు. క్రికెట్ ను ఆదరించే వారందరూ… శిఖర్ ధావన్ కు సపోర్ట్ గా నిలుస్తున్నారు. వెంటనే ఆయన కొడుకును శిఖర్ ధావన్ కు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కు కూడా దూరం కానున్నాడు.
Also Read: Roshan – CCL: తెలుగు వారియర్స్ లో మరో అభిషేక్ శర్మ..సిక్సులే సిక్సులు !
Shikhar Dhawan said, "I still message my son, even though I'm blocked from everywhere". 💔
– An emotional interview of Gabbar!pic.twitter.com/UesiSw3CLU
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 16, 2025