BigTV English

Anaganaga : సుమంత్ మూవీ.. ఓటీటీ నుంచి థియేటర్లలోకి..

Anaganaga : సుమంత్ మూవీ.. ఓటీటీ నుంచి థియేటర్లలోకి..

Anaganaga : అక్కినేని హీరో సుమంత్ ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే ఈ మధ్య సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. రీసెంట్ గా మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈయన రీసెంట్ గా అనగనగా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. నేరుగా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఓటీటీలో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అయితే ఈ మూవీని ఇప్పుడు ఓటీటీ నుంచి థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. ఈ మూవీ థియేటర్ రిలీజ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..


థియేటర్లలోకి అనగనగా..

ప్రేక్షకుల గుండెలను హత్తుకొనే కథతో ఎమోషనల్ టచ్ ఇచ్చింది.. ఈ సినిమా ప్రస్తుతం ఓటిటిలో మంచి వ్యూస్ ని సంపాదించుకుంది. ఈ క్రమంలోనే మూవీ టీమ్ సంచలన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా థియేటర్లలో వచ్చిన సినిమాలో ఓటీటీలో వస్తుంటాయి. కానీ ఓటీటీలో ముందు వచ్చిన మూవీలు అసలు థియేటర్లలోకి రావడం గమనార్హం. మొట్ట మొదటిసారి ఈ మూవీ ఓటీటీ నుంచి థియేటర్లలోకి రాబోతుంది. హీరో సుమంత్ నిజం చేసి చూపించాడు. ఈయన సినిమా పరిమితి థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. సుమంత్, కాజల్ చౌదరి నటించిన ఈ సినిమాను సన్నీ సంజయ్ డైరెక్ట్ చేశారు. ఓటీటీలో భారీ రెస్పాన్స్ రావడంతో తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించారు.. ఈ సందర్బంగా హీరో సుమంత్ ఈ విషయాన్ని బయట పెట్టాడు.


Also Read :జాను భర్త టోనీకి మరో అమ్మాయితో సంబంధం ఉందా..అందుకే జానుతో విడాకులా..?

నేడు అక్కడ మాత్రమే అనగనగా మూవీ రిలీజ్.. 

సుమంత్ నటించిన అనగనగా మూవీ ఓటీటీలో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అక్కడ ఊహించని రెస్పాన్స్ తో పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ సక్సెస్ ను టీమ్ సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కు చిత్ర యూనిట్ హాజరు అయ్యారు. ఈ మేరకు హీరో సుమంత్ మాట్లాడుతూ.. ఈ మూవీకి వస్తున్న రెస్పాన్స్, ప్రేక్షకుల కోరిక మేరకు సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం. విజయవాడలో ముందుగా ఈ నెల 24న, విశాఖపట్నంలో ఈ నెల 25న రిలీజ్ చేయబోతున్నాం. ఆ తర్వాత మరిన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తాం. నిజం చెప్పాలంటే ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. మళ్లీరావా తర్వాత నన్ను బాగా ఆకట్టుకున్న మూవీ ఇది. ముందు నుంచి కంటెంట్ పై నమ్మకంతోనే అందరం చేశాం. అదే నిజమైంది. ప్రేక్షకులు కంటెంట్ ను ఎంజాయ్ చేస్తున్నారు. మేం అనుకున్న దానికంటే ఎక్కువగానే ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించారు. ఇది అందరం సంతోషించాల్సిన విషయం. అయితే కొందరు కోరిక మేరకు ఈ సినిమాని ఓటీటీ నుంచి థియేటర్లలో కూడా రిలీజ్ చేయబోతున్నామంటూ ఆయన ప్రకటించారు.. మొత్తానికి ఈ సినిమాను ఓటీటీ నుంచి థియేటర్లలోకి రిలీజ్ చేశారు.. అక్కడ మంచి రెస్పాన్స్ తో పాటు వ్యూస్ ని అందుకున్న ఈ సినిమా.. ఇప్పుడు థియేటర్లలో రిలీజ్ అయ్యి ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×