BigTV English

Akshay Kumar : మూవీ నుంచి తప్పుకున్న నటుడు.. వడ్డీతో సహా కక్కించేసిన అక్షయ్ కుమార్!

Akshay Kumar : మూవీ నుంచి తప్పుకున్న నటుడు.. వడ్డీతో సహా కక్కించేసిన అక్షయ్ కుమార్!

Akshay Kumar :గత కొద్ది రోజుల నుండి అక్షయ్ కుమార్ (Akshay Kumar) , పరేష్ రావల్ (Paresh Rawal) మధ్య వివాదం చెలరేగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ వివాదం కారణంగా అటు పరేష్ రావల్ కూడా అక్షయ్ కుమార్ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ‘హేరా ఫేరీ 3’ నుండి తప్పుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఆయన ప్రకటనపై అక్షయ్ కుమార్ నిర్మాణ సంస్థ స్పందించి.. ఈ ప్రాజెక్ట్ నుండీ వైదొలిగినందుకు రూ.25 కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సిందే అంటూ చట్టపరంగా చర్య తీసుకున్నారు. అటు అక్షయ్ కుమార్ నిర్మాణ సంస్థ రూ.25 కోట్ల నష్టపరిహారం చెల్లించమని అడగడంతో పరేష్ రావల్ – అక్షయ్ కుమార్ నిర్మాణ సంస్థ మధ్య ఘర్షణ మొదలైంది. మరి వీరి మధ్య విభేదాలు రావడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..


మూవీ నుండి తప్పుకున్న పరేష్ రావల్.. వడ్డీతో సహా కక్కించిన అక్షయ్ కుమార్..

2000 సంవత్సరంలో ప్రియదర్శన్ డైరెక్షన్ వహించిన ‘హేరా ఫేరీ’ అనే హాస్య చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో కీలకంగా అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, పరేష్ రావల్, టబు, ఓం పూరీలు నటించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడంతో ఈ సినిమాకు సీక్వెల్ గా ‘ఫిర్ హేరా ఫేరీ’ అనే మూవీ 2006లో విడుదలైంది. ఈ సినిమాలో కూడా అక్షయ్ కుమార్, పరేష్ రావల్, సునీల్ శెట్టి లు కీలక పాత్రల్లో నటించారు. ఈ రెండు సినిమాలకు సీక్వెల్ గా మూడో భాగం ‘హేరా ఫేరీ 3’ ని అనౌన్స్ చేశారు మేకర్స్. ఇక హేరా ఫేరీ -3 మూవీలో కూడా అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, పరేష్ రావల్ లు కీలకంగా నటించబోతున్నారని తెలిసిందే . అయితే ఇప్పటికే పరేష్ రావల్ ఈ సినిమాకి సంబంధించిన ఒప్పందపత్రంపై సైన్ చేసి డేట్లు కూడా ఇచ్చారు. అలాగే ముందుగా అడ్వాన్స్ గా రూ.11 లక్షల రెమ్యూనరేషన్ కూడా తీసుకున్నారట. అయితే ఇప్పుడు సడన్ గా ఈ సినిమా నుండి పరేష్ రావల్ తప్పుకున్నట్టు చెప్పడంతో అక్షయ్ కుమార్ నిర్మాణ సంస్థ రూ.25 కోట్ల నష్టపరిహారం చెల్లించమని కోరింది. కానీ పరేష్ రావల్ మాత్రం తాను తీసుకున్న రూ.11 లక్షల డబ్బుని 15% వార్షిక వడ్డీతో ఇప్పటికే హేరా ఫేరీ మూవీ యూనిట్ కి ఇచ్చినట్టు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.


రూ.25 కోట్లు ఇవ్వాలని డిమాండ్..

అయితే ఈ సినిమా నుండి పరేష్ రావల్ తప్పుకోవడానికి కారణం పరేష్ రావల్ మొదట రూ.15 కోట్ల భారీ రెమ్యూనరేషన్ ని తీసుకోవడానికి ఒప్పందం చేసుకున్నారట. కానీ ఈ సినిమా 2026 లేదా 2027 చివర్లో విడుదల చేసే అవకాశం ఉండడం కారణంగా పరేష్ రావల్ సినిమా నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడట. ఎందుకంటే ఈ సినిమాకి రూ.15 కోట్ల రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసుకున్నాడు. కానీ అడ్వాన్స్ ఇచ్చినప్పటికీ తన మిగతా రెమ్యూనరేషన్ రూ. 14.89 కోట్లు సినిమా విడుదలయ్యాక నెలకి చెల్లిస్తామని చెప్పారట. అయితే సినిమా విడుదల 2026 చివర్లో లేదా 2027 లో ఉంటుందని చెప్పారు. ఇక అన్ని రోజులు రెమ్యూనరేషన్ కోసం వెయిట్ చేయడం ఇష్టం లేక పరేష్ రావల్ ఈ సినిమా నుండి తప్పుకున్నారట. కానీ ముందుగా అగ్రిమెంట్ పై సైన్ చేయడంతో పరేష్ రావల్ పై అక్షయ్ కుమార్ నిర్మాణ సంస్థ రూ.25 కోట్ల నష్టపరిహారాన్ని వేసింది. మరి అప్పుడే వడ్డీతో సహా చెల్లించిన పరేష్ రావల్ ఇప్పుడు నిర్మాణ సంస్థ చేస్తున్న డిమాండ్ కి దిగివస్తారో లేదో చూడాలి.

ALSO READ:War -2: పఠాన్ దారిలో వార్ -2.. టీజర్ ఎఫెక్ట్ భారీగా పడిందా..?

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×