War -2: ‘వార్ -2’.. టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్(NTR ) తొలిసారి హిందీలో చేస్తున్న చిత్రం ఇది. మొన్నటివరకు ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉండేవి. కానీ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ ఒక్కసారిగా అంచనాలను దించేసింది. ఈ టీజర్ కి ఊహించని రేంజ్ లో స్పందన వస్తుందని చూసిన ఫిలిం మేకర్స్ యష్ రాజ్ ఫిల్మ్స్ కి భారీ షాక్ తగిలింది. కచ్చితంగా పాజిటివ్ టాక్ వస్తుందనుకుంటే రివర్స్లో ట్రోలింగ్ జరిగేంత స్థాయిలో నెగటివిటీ మూట కట్టుకోవడంతో నిర్మాత ఆదిత్య చోప్రా (Aditya Chopra) జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ బడా హీరో ఎన్టీఆర్, బాలీవుడ్ బడా హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) మొదటిసారి కలిసి చేస్తున్న సినిమా కాబట్టి రెస్పాన్స్ అదిరిపోతుందని, యూట్యూబ్ వ్యూస్లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని భావిస్తే.. అది ఏమాత్రం జరగలేదు. మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి కానీ ఈ సినిమా టీజర్ నెంబర్ వన్ కాలేకపోవడంతో అటు అభిమానులు కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. పైగా ఈ టీజర్ కోసం ఎదురుచూసిన బాలీవుడ్ ఆడియన్స్ కూడా పెదవి విరవడం గమనార్హం.
పఠాన్ దారిలో వార్ -2..
అనుకున్నదొకటి అయినదొకటి అన్నట్టుగా ఇప్పుడు వారి పరిస్థితి మారిపోయింది. అందుకే టీజర్ తో మంచి స్పందన వస్తుందనుకున్న టీం కి ఎదురు దెబ్బ తగిలింది కాబట్టి ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. వార్ -2 బృందం పఠాన్ (Pathaan) దారిలో నడవాలని నిర్ణయించుకుందట.అందులో భాగంగానే ఫీడ్ బ్యాక్ ని సీరియస్ గా తీసుకొని, ఎక్కువ కంప్లైంట్స్ దేని గురించి వచ్చాయో వాటిపై మళ్లీ పనిచేయాలని నిర్ణయించుకుందట. ఇకపోతే టీజర్ విడుదలైన తర్వాత ఎక్కువగా వీ ఎఫ్ ఎక్స్ గురించి కామెంట్లు వచ్చాయి. అప్పుడు పఠాన్ టైంలో కూడా ఇవే వినిపించినప్పటికీ.. తర్వాత వాటిని సరి చేయడం వల్ల డామేజ్ ను కాస్త తగ్గించగలిగారు. ఆ తర్వాత సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు అదే ఫార్ములాను వార్ 2 కి కూడా వాడబోతున్నారట. అసలు టీజర్ లో ఎడిటింగ్ సరిగ్గా జరగలేదని, టైం దగ్గర పడడంతో హడావిడిగా టీజర్ కట్ చేసి అనవసరంగా డామేజ్ చేసుకున్నామని మేకర్స్ ఫీలవుతున్నారు. అందుకే ఇప్పుడు వీ ఎఫ్ ఎక్స్ పనులు మళ్లీ మొదలుపెట్టి, ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో దానిని తిరిగి పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. మరి ఇది ఏ మేరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.
ఆ మూవీ దెబ్బకు వెనక్కి తగ్గిన వార్ -2
ఇకపోతే ఈ సినిమాకు మరో పెద్ద సమస్య ఎదురైందని చెప్పాలి. ఆగస్టు 14వ తేదీన ఈ సినిమా విడుదలవుతున్న విషయం తెలిసిందే. అదే రోజున సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth ) ‘కూలీ’ మూవీ కూడా విడుదల కాబోతోంది. అటు చిన్నచిన్న టీజర్లతోనే దర్శకుడు లోకేష్ కనగరాజు (Lokesh Kanagaraju) సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాడు. దీనికి తోడు అన్ని ప్రదేశాలలో కూడా ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఇక ట్రైలర్ వచ్చాక ఆ క్రేజ్ ఎక్కడికి చేరుకుంటుందో ఊహించడం కష్టం. అందుకే ఎందుకు లేనిపోని సమస్య అని ఇప్పుడు వార్ -2 రిలీజ్ ను కూడా వాయిదా వేస్తున్నట్లు సమాచారం.
ALSO READ:Mega 157 Movie: చిరు కోసం కెరీర్ లోనే ఫస్ట్ టైం… సడన్ గా ఈ నిర్ణయం ఎందుకు అంటే..?