BigTV English

OTT Movie : మనిషితో ప్రేమలో పడే ఆడ పిశాచి… ఊహించని క్లైమాక్స్ ట్విస్ట్

OTT Movie : మనిషితో ప్రేమలో పడే ఆడ పిశాచి… ఊహించని క్లైమాక్స్ ట్విస్ట్

OTT Movie : దెయ్యాలు ఉన్నాయో లేవో గాని, సినిమాలలో మాత్రం బాగానే చూపిస్తుంటారు.  ఈ హారర్ జోనర్లో వచ్చే సినిమాలకు ప్రత్యేకమైన ఫాన్స్ ఉన్నారు.  అయితే కొంతమంది హారర్ సినిమాలను చూస్తూ పైకి ధైర్యంగా నాటిస్తుంటారు. కాని లోపల మాత్రం చెమటలు పడుతుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా భయపెట్టే సన్నివేశాలతో చెమటలు పట్టిస్తుంది. అనుష్కా శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? దీని పేరు ఏమిటి ? అనే వివరాల్లోకి వెళితే ..


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ సూపర్‌నాచురల్ హారర్ సినిమా పేరు పరి (Pari). 2018 లో విడుదలైన ఈ మూవీకి ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహించారు. ఇది అనుష్కా శర్మకు చెందిన క్లీన్ స్లేట్ ఫిల్మ్జ్ నిర్మాణంలో తెరకెక్కింది. ఈ సినిమా స్టోరీ ఇఫ్రిత్ అనే రాక్షసుడి చుట్టూ తిరుగుతుంది. ఇందులో అనుష్కా శర్మ ప్రధాన పాత్రలో నటించగా, పరంబ్రత ఛటర్జీ, రితాభరి చక్రవర్తి, రజత్ కపూర్, మాన్సీ ముల్తానీ సహాయక పాత్రల్లో నటించారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

అర్ణబ్ అనే యువకుడు, పియాలి అనే నర్సుతో, తన తల్లిదండ్రులతో కలసి పెళ్ళిచూపులకు వెళతాడు. తర్వాత కారులో ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు భారీ వర్షం పడుతుంది. వాళ్ళ కారు ఒక వృద్ధ మహిళను ఢీకొట్టడంతో, ఆమె అక్కడికక్కడే మరణిస్తుంది. పోలీసులు ఆమె ఇంటిని పరిశోధించగా, అక్కడ రుఖ్సానా (అనుష్కా శర్మ) అనే యువతి సంకెళ్లతో బంధించబడి ఉన్నట్లు తెలుస్తుంది. ఆమె బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా, వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆమెకు ఎవరూ లేరని భావించిన అర్ణబ్, సానుభూతితో ఆమెను తన ఇంటికి తీసుకెళ్తాడు. రుఖ్సానాకు ఇప్పటి ప్రపంచం గురించి ఏమీ తెలియదు. తరచూ ఎందుకో భయపడుతూ ఉంటుంది. అర్ణబ్ ఆమె ప్రవర్తనను వింతగా భావిస్తాడు. కానీ ఆమె పట్ల అతనికి సానుభూతి కలుగుతుంది. వాళ్ళు కలిసి గడిపే సమయంలో, రుఖ్సానా అతనిపై ప్రేమను పెంచుకుంటుంది.

ఇంతలో ఒక మార్చురీ అసిస్టెంట్ రుఖ్సానా తల్లి శరీరంపై కల్ట్ గుర్తును కనిపెట్టి, రుఖ్సానాను చాలా కాలంగా వెతుకుతున్న ప్రొఫెసర్ అలీకి సమాచారం అందిస్తాడు. ఒక రాత్రి రుఖ్సానా అనారోగ్యానికి గురవుతుంది. అర్ణబ్ దానిని సాధారణ విషయంగా భావిస్తాడు, కానీ వాస్తవానికి ఆమె శరీరంలో ఉన్న రాక్షస రక్తం కారణంగా, ప్రతి నెలా విషాన్ని విడుదల చేయాల్సి ఉంటుంది. అందుకే ఆమె నీరసంగా ఉంటుంది.ఈ క్రమంలో ఆమె గర్భవతి అని తెలుసుకున్న అర్ణబ్, ప్రొఫెసర్ అలీ సహాయం తీసుకుంటాడు. అలీ రుఖ్సానాను బంధించి, ఆమెను చంపడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆమె తప్పించుకుని అలీని చంపేస్తుంది. చివరికి రుఖ్సానాను అలీ ఎందుకు చంపాలి అనుకున్నాడు ? రుఖ్సానా శరీరంలో రాక్షస రక్తం ఎందుకు ప్రవహిస్తోంది ? అర్ణబ్ తో లవ్ స్టోరీ ఏమౌతుంది. ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : పుట్ బాల్ ఆడే కుక్క… ఈ మలయాళ కామెడీ ఫ్యామిలీ డ్రామాకు పొట్ట చెక్కలే

Related News

OTT Movie :సిటీ జనాల్ని చితగ్గొట్టే డిమాన్స్… సూపర్ హీరోలనూ వదలకుండా దబిడి దిబిడే

OTT Movie : ఈ వారం ఓటీటీలోకి అడుగు పెట్టిన సిరీస్ లు… ఒక్కోటి ఒక్కో జానర్ లో

OTT Movie : తలపై రెడ్ లైన్స్… తలరాత కాదు ఎఫైర్స్ కౌంట్… ఇండియాలో వైరల్ కొరియన్ సిరీస్ స్ట్రీమింగ్ షురూ

OTT Movie : పిల్లోడిని చంపి సూట్ కేసులో… మైండ్ బెండయ్యే కొరియన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్

OTT Movie : రెంటుకొచ్చి పక్కింటి అమ్మాయితో… కారు పెట్టిన కార్చిచ్చు… దిమాక్ కరాబ్ ట్విస్టులు సామీ

OTT Movie : అమ్మాయి ఫోన్ కి ఆ పాడు వీడియోలు… ఆ సౌండ్ వింటేనే డాక్టర్ కి దడదడ… మస్ట్ వాచ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : పిల్లల ముందే తల్లిపై అఘాయిత్యం… సైతాన్ లా మారే కిరాతక పోలీస్… క్లైమాక్స్ లో ఊచకోతే

OTT Movie : కాల్ సెంటర్ జాబ్ లో తగిలే కన్నింగ్ గాడు… ఫోన్లోనే అన్నీ కానిచ్చే కస్టమర్లు… నరాలు కట్టయ్యే సస్పెన్స్

Big Stories

×