BigTV English

Sundeep Kishan : లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సందీప్ కిషన్… ఎల్సీయూలో పార్ట్ అవుతున్నాడా ?

Sundeep Kishan : లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సందీప్ కిషన్… ఎల్సీయూలో పార్ట్ అవుతున్నాడా ?

Sundeep Kishan : ప్రముఖ టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) లేటెస్ట్ గా ‘మజాకా’ (Mazaka) అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘ధమాకా’ ఫేమ్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు. రీతూ వర్మ హీరోయిన్ గా నటించింది. అలాగే వెటరన్ హీరోయిన్ అన్షు అంబానీ, రావు రమేష్, శ్రీనివాస్ రెడ్డి, మురళీ శర్మ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. శివరాత్రి సందర్భంగా ఈ మూవీని ఫిబ్రవరి 26న రిలీజ్ చేశారు. సందీప్ కిషన్ ఈ మూవీపై ఎంతగానో హోప్స్ పెట్టుకున్నాడు. కానీ మూవీకి నెగిటివ్ టాక్ రావడంతో ఆ ఎఫెక్ట్ కలెక్షన్లపై పడింది. ఇదిలా ఉండగా సందీప్ విషయం తాజాగా తన అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.


లోకేష్ కనగరాజ్ తో సందీప్ కిషన్

‘మజాకా’ మూవీ ప్రమోషన్లలో సందర్భంగా సందీప్ కిషన్ ఫ్యూచర్లో తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో కలిసి పని చేసే అవకాశం ఉందని హింట్ ఇచ్చారు. సందీప్ కిషన్ మాట్లాడుతూ “నేను ఇంకా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం కాలేదు. కానీ ఆయనతో కలిసి పని చేస్తున్నాను. ఇప్పుడు దాని గురించి పెద్దగా వివరాలు వెల్లడించలేను. అంతేకాకుండా అసలు అది లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కిందకు వస్తుందో లేదో నాకు తెలియదు” అంటూ బ్లాస్ట్ అయ్యే అప్డేట్ ఇచ్చారు. ఒకవేళ లోకేష్ కనగరాజ్ తో సందీప్ కిషన్ సినిమా చేస్తే, ఆ మూవీతోనైనా ఈ  ఈ పీపుల్ స్టార్ కెరియర్ టర్న్ అవుతుందా అనేది చూడాలి.


‘కూలీ’లో స్పెషల్ రోల్

‘మజాకా’ మూవీ ప్రమోషన్లలో భాగంగానే సందీప్ కిషన్ ‘కూలీ’లో కీలక పాత్ర పోషించబోతున్నాడు అని వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ‘కూలీ’ సినిమాలో తాను భాగం కాదని స్పష్టం చేసిన సందీప్ కిషన్, సినిమాను మాత్రం 45 నిమిషాల పాటు చూసానని చెప్పుకొచ్చారు. మూవీ చూసాక ఇది కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నమ్ముతున్నానని, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల కలెక్షన్స్ రాబడుతుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

కొన్ని రోజులు క్రితం ‘కూలీ’ సెట్స్ లో లోకేష్ కనగరాజ్, సూపర్ స్టార్ రజినీకాంత్ లతో సందీప్ కిషన్ కలిసి ఉన్న ఫోటో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సందీప్ కిషన్ ఈ సినిమాలో పార్ట్ కాబోతున్నాడని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా వీటి పైనే స్పందిస్తూ “నేను కూలీలో భాగం కాదు. లోకేష్ నా స్నేహితుడు కాబట్టి సూపర్ స్టార్ రజనీకాంత్ ను చూడడానికి నేను సెట్ కి వెళ్లాను” అని సందీప్ కిషన్ క్లారిటీ ఇచ్చారు. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ‘కూలీ’ మూవీకి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తుండగా… నాగార్జున, ఉపేంద్ర, శృతిహాసన్, సత్యరాజ్, షౌబిన్ షాహీర్ వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో అమీర్ ఖాన్ అతిథిగా నటించబోతున్నారు. పూజ హెగ్డే స్పెషల్ సాంగ్ చేయబోతోంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×