Sunny Leone : బాలీవుడ్ లోని ప్రముఖులంతా కోట్లు కోట్లు పోసి, కాస్ట్లీ ఏరియాలలో ఆస్తులను కొనుగోలు చేస్తున్నారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ (Abhishek Bacchan) భారీగా ఆస్తులు కొనుగోలు చేశారన్న వార్తలు ఇటీవల కాలంలో నెట్టింట్లో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్టులో గ్లామర్ బ్యూటీ సన్నీ లియోన్ (Sunny Leone) కూడా చేరిపోయింది. ముంబై లోని కాస్ట్లీ ఏరియాలో ఓ ఫ్లాట్ కొన్న సన్నీ లియోన్, ఇకపై ఆ పనులన్నీ అందులోనే చేయబోతుందట.
కాస్ట్లీ ఫ్లాట్ కొన్న సన్నీ లియోన్
ముంబైలోని ఓషివారాలో ఉన్న ఒక ఆఫీస్ స్పేస్ ని సన్నిలియోన్ (Sunny Leone) కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. దీని విలువ ఏకంగా 8 కోట్ల వరకు ఉంటుందట. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ 2025 ఫిబ్రవరి లోనే చేసుకున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ లోఖండేవాలా కాంప్లెక్స్ సమీపంలోనే ఉంది. ఓషివారాలోని మెయిన్ రోడ్లు, ముంబై మెట్రో వంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉన్న బిజీ ఏరియాలో ఈ ప్లేస్ ఉండడం విశేషం. కాగా దీనికి సంబంధించి సన్నిలియోన్ స్టాంపు డ్యూటీగా 35 లక్షలకు పైగానే చెల్లించగా, రిజిస్ట్రేషన్ చార్జీలు రూ. 30,000 పడ్డట్టు తెలుస్తోంది. అలాగే ఈ ఫ్లాట్లో ఆమె మూడు కార్ల పార్కింగ్ స్థలాలు ఉంటాయట. ఇది ఆఫీస్ స్పేస్ కాబట్టి సన్నీ ఇందులోనే తన ఆఫీస్ వర్క్ పనులన్నీ పెట్టుకుంటుందని అంటున్నారు. ఆమె ప్రచారం జరుగుతున్నట్టుగా ఆఫీస్ పెడుతుందా? లేదంటే అద్దెకి ఇస్తుందా ? అనేది చూడాలి.
కాగా సన్నీలియోన్ (Sunny Leone) ఈ ఆఫీస్ ఫ్లాట్ ని ఐశ్వర్య ప్రాపర్టీ అండ్ ఎస్టేట్స్ నుంచి కొనుగోలు చేసినట్టు సమాచారం. మరో ఇంటరెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ కంపెనీ ఆనంద్ కమల్ నాయన్ పండిట్ అండ్ రూపా ఆనంద్ పండిట్లకు చెందింది. ఆనంద్ పండిట్ మరెవరో కాదు, ఒక ప్రముఖ చిత్ర నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, రియల్ ఎస్టేట్ డెవలపర్ కూడా. ఆయన ఇప్పటిదాకా హిందీలో టోటల్ ధమాకా, చెహ్రే, ది బిగ్ బుల్ వంటి సినిమాలను నిర్మించారు.
సన్నీలియోన్ నైబర్స్ కూడా ప్రముఖులే
ఇక ఈ భవనంలోనే చాలామంది బాలీవుడ్ ప్రముఖులు ఆస్తులను కొనుక్కున్నట్టు తెలుస్తోంది. సమాచారం ప్రకారం బిగ్ బీ అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ బడా స్టార్ అజయ్ దేవగన్ (Ajay Devgan), కార్తీక్ ఆర్యన్ (Karthik Aryan), సారా అలీ ఖాన్ (Sara Ali Khan) లాంటి యంగ్ స్టర్స్ సైతం ఇక్కడ ఆస్తులు కొనుగోలు చేశారు. ఇక సన్నీలియోన్ (Sunny Leone) విషయానికి వస్తే… ఈ అమ్మడు ఓవైపు మోడల్ గా, నటిగా, బిజినెస్ ఉమెన్ గా అదరగొడుతోంది. జిస్మ్ 2, రాగిణి ఎంఎంఎస్ 2, ఏక్ పెహలి లీలా వంటి సినిమాలతో తెగ పాపులర్ అయిన సన్నిలియోన్ ఇటీవల కాలంలో సినిమాలను చాలా వరకు తగ్గించింది. అయితే 2018లో ఈ అమ్మడు స్టార్ స్ట్రక్ అనే కాస్మెటిక్ బ్రాండ్ ని స్టార్ట్ చేసింది.