BigTV English

RC 16: ‘ఆర్సీ 16’తో రిపీట్.. అదే ప్లాన్‌ను వర్కవుట్ చేస్తున్న బుచ్చిబాబు..

RC 16: ‘ఆర్సీ 16’తో రిపీట్.. అదే ప్లాన్‌ను వర్కవుట్ చేస్తున్న బుచ్చిబాబు..

RC 16: మామూలుగా ప్రతీ దర్శకుడు కథను చెప్పే విషయంలో ఒక సెపరేట్ స్టైల్ ఫాలో అవుతాడు. ఆ స్టైల్ ప్రేక్షకులకు నచ్చుతూ సినిమాలు హిట్ అవుతున్నంత కాలం దానిని మార్చడానికి ప్రయత్నించాడు. ప్రతీ డైరెక్టర్ సక్సెస్ ఫార్ములాలో ఇది కూడా ఒకటి. అలాగే బుచ్చి బాబు కూడా ఒక సక్సెస్ ఫార్ములా ఉందని తను తెరకెక్కించిన ‘ఉప్పెన’ చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు రామ్ చరణ్‌తో తన కెరీర్‌లోని రెండో సినిమాను డైరెక్ట్ చేయడానికి సిద్ధమయ్యాడు బుచ్చి బాబు సానా. ఇక ‘ఆర్సీ 16’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో కూడా బుచ్చి బాబు తన రొటీన్ సక్సెస్ ఫార్ములాను ఫాలో అవుతాడని వార్తలు వినిపిస్తున్నాయి.


పూర్తి ఫోకస్ అక్కడే

రామ్ చరణ్ చివరిగా శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ అనే సినిమాలో నటించాడు. గత మూడేళ్లుగా తన ఫ్యాన్స్ అంతా ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూశారు. కానీ ఆ ఫ్యాన్స్‌ను ఈ మూవీ అంతగా తృప్తిపరచలేకపోయింది. ‘గేమ్ ఛేంజర్’కు మొదటి రోజు నుండే మిక్స్‌డ్ టాక్ లభించింది. రామ్ చరణ్ హేటర్స్ అయితే ఈ సినిమాపై మరింత నెగిటివిటీ పెంచేశారు. దీంతో ఈ మూవీని చూడడానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోయింది. ఇదంతా పక్కన పెట్టేసి బుచ్చి బాబుతో తన తరువాతి మూవీపై ఫుల్ ఫోకస్ పెట్టాలని ఫిక్స్ అయ్యాడు రామ్ చరణ్.


రెగ్యులర్ షూటింగ్ మొదలు

ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ మూవీ రిలీజ్ అయిపోయింది. ఆఖరికి ఇది ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ ప్రారంభించుకుంది. కాబట్టి ఈ మూవీపై రామ్ చరణ్ (Ram Charan) బాధ్యత తీరిపోయింది. అందుకే బుచ్చి బాబుతో కలిసి తను చేస్తున్న ‘ఆర్సీ 16’పై ఫోకస్ పెట్టాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమయ్యింది. ఈ మూవీ సెట్‌లోకి క్లిన్ కారా వచ్చినట్టుగా ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు చరణ్. అయితే స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా క్లైమాక్స్‌ను తన స్టైల్‌లో ప్లాన్ చేస్తున్నాడట బుచ్చి బాబు. సినిమా చూసిన ప్రేక్షకులంతా కాసేపు ఆ క్లైమాక్స్ గురించే ఆలోచించేలా చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడని తెలుస్తోంది.

Also Read: చిన్నారికి ప్రాణం పోసిన మెగా మేనల్లుడు… పోస్ట్ వైరల్

క్లైమాక్స్ కీలకం

బుచ్చి బాబు (Buchi Babu) దర్శకుడిగా పరిచయమయిన సినిమా ‘ఉప్పెన’. అది డైరెక్టర్‌గా తన డెబ్యూ మూవీనే అయినా కూడా ప్రేక్షకులకు తను గుర్తుండిపోవడానికి కారణం ఆ సినిమా క్లైమాక్స్. సినిమా మొత్తాన్ని.. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌ను ఒక ప్రేమకథగా మలిచాడు. కానీ సెకండ్ హాఫ్ మరో మలుపు తిరుగుతుంది. ఇక ఆ క్లైమాక్స్ అయితే ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాలో చూడలేదు అనిపించేలా ఉంటుంది. ‘ఉప్పెన’ ఆ రేంజ్‌లో హిట్ అవ్వడానికి కారణం కూడా అదే. ఇప్పుడు ‘ఆర్సీ 16’కు కూడా అదే ఫార్ములా ఫాలో అవ్వనున్నాడట బుచ్చి బాబు. సినిమా అంతా ఎలా ఉన్నా దాని క్లైమాక్స్ మాత్రం ఆడియన్స్‌కు గుర్తుండిపోయేలా ఉండనుందని సమాచారం.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×