BigTV English

Sunny Leone: మరోసారి పెళ్లి చేసుకున్న సన్నీ లియోన్.. ముగ్గురు పిల్లలముందే..

Sunny Leone: మరోసారి పెళ్లి చేసుకున్న సన్నీ లియోన్.. ముగ్గురు పిల్లలముందే..

Sunny Leone: బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ రెండోసారి పెళ్లి చేసుకుంది. ఏంటి.. నిజమా.. ? విడాకులు తీసుకున్నట్లు కూడా తెలియలేదే అని కంగారుపడకండి. సన్నీ రెండోసారి పెళ్లి చేసుకుంది.. కానీ, ఆమె భర్తనే చేసుకుంది.  అడల్ట్ స్టార్ గా కెరీర్ ను ప్రారంభించిన సన్నీ.. ఆ సమయంలోనే అమెరికాకు చెందిన డేనియల్ వెబర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.


పెళ్లి తరువాత కూడా ఆమె ఆ కెరీర్ ను కంటిన్యూ చేసింది కూడా.  ఇక అప్పటికే సన్నీ – డేనియల్ కు ఇద్దరు పిల్లలు. మరో చిన్నారిని ఆమె దత్తత తీసుకుంది. సొంత బిడ్డలానే ఆమెను కూడా సన్నీ పెంచుతుంది. ఇక ఎప్పుడైతే సన్నీ.. బాలీవుడ్ బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిందో అప్పటి నుంచి అడల్ట్ సినిమాలు తీయడం మానేసింది. బాలీవుడ్ లోనే ఐటెంసాంగ్స్ చేస్తూనే హీరోయిన్ గా మారి.. మంచి గుర్తింపును తెచ్చుకుంది.  తెలుగులో కూడా అమ్మడు ఆడిపాడిన విషయం విదితమే.

SDT18: మెగా మేనల్లుడికి ధీటైన విలన్నే పట్టారే.. ముచ్చటగా మూడోసారి..


ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ హాట్ బ్యూటీ.. కొద్దిగా సినిమాలకు గ్యాప్ ఇచ్చి కుటుంబంతో  వెకేషన్ కు మాల్దీవులకు వెళ్లింది. ఈ జంట తమ 13 వ పెళ్లి రోజును అక్కడ ఘనంగా జరుపుకున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు పిల్లల ముందు.. సన్నీ – డేనియల్ మరోసారి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి దుస్తుల్లో ఈ జంట ఎంతో అందంగా  కనిపించారు.

బీచ్ ఒడ్డున.. పెళ్లి డెకరేషన్ మధ్యలో  పెళ్లి గౌన్ లో సన్నీ, డేనియల్ రింగులు మార్చుకొని.. మరోసారి భార్యాభర్తలుగా మారారు.  ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలను చూసిన అభిమానులు.. మీ జంట ఎంతోమందికి ఆదర్శం. పెళ్లి అయ్యి నాలుగేళ్లు కూడా కలిసి ఉండలేని జంటలు.. వీరిని చూసి నేర్చుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు.

Bhairavam: గరుడన్ రీమేక్.. ఊర మాస్ లుక్ లో బెల్లంకొండ హీరో.. శివ తాండవమే

తెలుగు,తమిళ్ , మలయాళ, హిందీ భాషల్లో సన్నీ వరుస సినిమాలతో బిజీగా ఉంది.  త్వరలోనే ఆమె నటించిన సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. మరి ఈ సినిమాలతో ఈ హాట్ బ్యూటీ ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×