Kamran Akmal On IND VS NZ ODI: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (New Zealand vs India) మధ్య రేపటి నుంచి వన్డే సిరీస్ (India tour of New Zealand 2026 ) ప్రారంభం కానుంది. ఇప్పటికే టి20 సిరీస్ గెలుచుకున్న ఊపులో ఉన్న టీమిండియా… వన్డే సిరీస్ పైన కూడా కన్నేసింది. అయితే రేపటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ (Kamran Akmal ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ వన్డే సిరీస్ కూడా 3-2 తేడాతో టీమిండియా గెలవడం గ్యారెంటీ అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అందుకే న్యూజిలాండ్ క్రికెటర్లు వరుసగా గాయాల బారిన పడుతూ… వన్డే సిరీస్ కు కావాలనే దూరం అవుతున్నట్టు ఆరోపించాడు. టీమిండియా గెలుపునకు లైన్ క్లియర్ చేసే క్రమంలో గాయాల డ్రామాలు న్యూజిలాండ్ క్రికెటర్లు చేస్తున్నట్టు వివాదాస్పద స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో కమ్రాన్ అక్మల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన టి20 సిరీస్ లో ఫిక్సింగ్ జరిగిందని కమ్రాన్ అక్మల్ ఆరోపణలు చేశాడు. అందుకే అవలీలగా మూడు మ్యాచ్ లలో టీమిండియా గెలిచే సిరీస్ కైవసం చేస్తుందని బాంబు పేల్చాడు. ఇప్పుడు వన్డే సిరీస్ కూడా టీమిండియా గెలిచేలా ఇప్పటికే బీసీసీఐ సెట్ చేసినట్టు బాంబు పేల్చాడు. న్యూజిలాండ్ క్రికెటర్లు అమ్ముడుపోయారని ఆగ్రహించాడు. న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా బ్యాటర్లకు ఏ మాత్రం ఆడరాదని… కానీ ఈ సారి అద్భుతంగా రాణించడంతో తనకు అనుమానం వచ్చినట్టు వ్యాఖ్యానించాడు. రేపు వన్డే సిరీస్ కూడా ఇలాగే చేస్తారని బాంబు పేల్చాడు. అయితే వన్డే సిరీస్ కోసం ప్లాన్ మార్చి..న్యూజిలాండ్ క్రికెటర్లు గాయాల డ్రామాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యాడు. గాయాలు కాకున్నా కావాలనే కీలక ప్లేయర్లు దూరం అవుతున్నట్టు మండిపడ్డాడు.
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మొత్తం నలుగురు కివీస్ ఆటగాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరం అయ్యారు. ఇప్పటికే రచిన్ రవీంద్ర, చాప్ మాన్ గాయాల కారణంగా సిరీస్ కు దూరం కాగా… లేటెస్ట్ గా మరో ఇద్దరు కూడా అదే బాట పట్టారు. ఈడెన్ పార్క్ లో జరిగిన ఫీల్డింగ్ సెషన్ సందర్భంగా క్యాచ్ పట్టేందుకు వెళ్లి మ్యాట్ హెన్రీని కాన్వే ఢీ కొట్టాడు. ఈ క్రమంలో ఈ ఇద్దరికీ గాయాలు అయ్యాయి. వెంటనే హెన్రీ, కాన్వేను ఆసుపత్రికి తరలించారు. ఈ ఇద్దరూ తొలి వన్డేకు దూరం కానున్నారని సమాచారం.